దేశంలో సంచలనం రేపి నిర్భయ కేసులో కొత్త కొత్త డేట్లు విని జనాలు విసిగి పోతున్నారు.. కానీ ఒక్క ఆశ అలాంటి రాక్షసులకు ఉరి మాత్రం ఖచ్చితంగా పడాలని కోరుకుంటున్నారు.  ఇటీవల తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారా, హత్య కేసులో నలుగురు నింధితులు ఎన్ కౌంటర్ కి గురైన విషయం తెలిసిందే.  కారణం ఏదైనా.. ఎన్ కౌంటర్ విషయంపై మాత్రం యావత్ బారత దేశంలో పోలీసులపై హర్షాతిరేకలు వెల్లువెత్తాయి.  అయితే నిర్భయ కేసులో మాత్రం నింధితులకు ఉరి శిక్ష ఖాయం అయినట్టే అవుతుంది.. తిరిగి వాయిదా పడుతుంది.  అయితే నిర్భయ తల్లి మాత్రం తన కూతురు కి అన్యాయం చేసిన వారికి తప్పకుండా ఉరి పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది.  నిర్భయ నింధితులకు వాస్తవానికి ఈ నెల 3న ఉరిపడాల్సి ఉన్నా.. మరోసారి వాయిదా పడింది. 

 

నిర్భయ దోషులకు సంబంధించిన కొత్త డెత్ వారెంట్ ను ఈరోజు ఢిల్లీ పటియాల కోర్ట్ జారీ చేసింది.  మార్చి 20 వ తేదీన ఉదయం 5:30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని వారెంట్ జారీ చేసింది.  పాటియాల కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది నాలుగోసారి.  జనవరిలో రెండుసార్లు, ఫిబ్రవరి ఒకసారి డెత్ వారెంట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే.   అయితే ఇప్పటికే మూడుసార్లు నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో నాలుగోసారి డెత్ వారెంట్లను ఈరోజు పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది.   

 

కాగా, నలుగురిలో నాలుగో దోషి పవన్ గుప్త కూడా న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తి చేసుకున్నాడు. ఆయన పిటీషన్ రాష్ట్రపతి తిరస్కరించారు.  నలుగురు దోషులు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించు కోలేకపోవడంతో పాటియాల హౌస్ కోర్ట్ మరోసారి డెత్ వారెంట్ ను జారీ చేసింది.  ఉరి తీసే సమయం ఉదయం 6 గంటల నుంచి అరగంట ముందుకు జరిపి ఉదయం 5:30 గంటలకు ఉరి తీయాలని కోర్టు డెత్ వారెంట్ లో పేర్కొన్నది.   

మరింత సమాచారం తెలుసుకోండి: