ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతోంది. టీడీపీ వైసీపీ బీసీలకు రిజర్వేషన్లు తగ్గించే యోచనలో ఉండటంతో న్యాయ పోరాటానికి దిగుతోంది. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. 
 
కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసిన టీడీపీ నేతలు ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపేలా చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ స్తంభాలకు, నీటి ట్యాంకులకు, పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసిందని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంచాలని కోరారు. 
 
నిన్న టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల గురించి గవర్నర్ ను కలిశారు. గవర్నర్ కు రిజర్వేషన్ల గురించి వినతి పత్రాన్ని అందజేశారు. సీఎం జగన్ బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతుందని.... బీసీలు 16,000 పదవులు కోల్పోయే అవకాశం ఉందని గవర్నర్ కు చెప్పారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. 
 
సుప్రీం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తే ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సుప్రీం ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తుందో లేదో చూడాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులపై బిర్రు ప్రతాప్ రెడ్డి, రామాంజనేయులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో సుప్రీం తీర్పుకు విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: