తెలుగు పత్రికా రంగంలో అత్యంత ప్రముఖులలో ఒకరు, సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న అయన బంజారాహిల్స్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్స తీసుకుంటున్నప్పటికీ..   కోలుకోలేని స్థితిలో ఈ ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ఇక  పొత్తూరు 1934 ఫిబ్రవరి 08న గుంటూరు జిల్లా పొత్తూరులో వెంకట సుబ్బయ్య తల్లి పేరు పన్నగేంగ్రమ్మ దంపతులను జన్మించారు. తెలుగు పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకుపైగా అయన సేవలందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానం మొదలుపెట్టి ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో కొనసాగించగా... టిటిడి ప్రచురణలతో పాటు పలు పత్రికలకు సంపాదకులుగా పనిచేసారు.  ఆయన మృతి పట్ల పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు.  

 

ప్రముఖ పాత్రికేయుడు, ఉమ్మడి ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ పొత్తూరి వెంకటేశ్వరరావు తెలంగాణ ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చి ఎంతో సహకరించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన కేసీఆర్‌ ఉద్యమం నాటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 

 

తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరావు ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని సీఎం జగన్ తెలిపారు. పొత్తూరి కుటుంబసభ్యులకు జగన్ ప్రగఢ సానుభూతిని తెలియజేశారు. 

 

పొత్తూరి కుటుంబ సభ్యులకు హరీష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని, తెలుగు పత్రికా రంగానికి పొత్తూరి సేవలు మరువలేనివని హరీష్ కొనియాడారు. పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరి సంతాపం తెలిపారు.

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: