ఈ నెలలోనే జ‌ర‌గ‌బోయే రాష్ట్ర స్థానిక ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిస్టాత్మ‌కంగా తీసుకున్నారు వైసీపీ అధినే త‌, సీఎం జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అనేక రూపాల్లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఎవరి బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించిన ఆయ‌న‌.. మంత్రుల‌, ఎమ్మెల్యేల‌ను తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించా రు. దీంతో ఒక్క‌సారిగా వైసీపీలో వేడి పుట్టింది. త‌న ప‌ది నెల‌ల పాల‌న‌కు రిఫ‌రెండంగా(పైకి చెప్ప‌క‌పోయి నా) జ‌గ‌న్ బావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డంతోపాటు 90 శాతం స్తానిక ఎన్నిక‌ల్లో స్థానాల‌ను కొల్ల‌గొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.



దీంతో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేస‌మయం లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఎవ‌రూ విధించ‌ని ఆంక్ష‌లు కూడా విధించారు. ఎక్క‌డ హ‌ద్దు మీరినా.. గెల‌వ‌క ముందే కాదు.. గెలిచిన త‌ర్వాత కూడా చ‌ర్య‌లు తీసుకునేందుకు జ‌గ‌న్ రెడీ అయ్యారు. దీంతో ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు హ‌డ‌లిపోతున్నారు. ఎక్క‌డ ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా కూడా బుక్క‌యిపోతామ‌ని భావించి చాలా మందిఅస‌లు పోటీలోనే ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ మ‌రింత‌గా త‌న పార్టీలో ఉచ్చుబిగించారు.



స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను ఐదుగురు కీల‌క నాయ‌కుల‌కు అప్ప‌గించారు. రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభించిన జ‌గ‌న్‌.. ఐదుగురికి వాటిని గెలిపించే బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలిసింది. వారి పేర్లు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఎన్నిక‌ల్లో పార్టీ మెజారిటీని మించిన స్థానాల్లో గెలిపించాల‌ని ఐదు జోన్ల బాధ్యుల‌కు జ‌గ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ ప‌రిణామం వైసీపీలో మ‌రింత ఉత్తేజం నింప‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



జోన్                                                          బాధ్యులు
ఉత్తరాంధ్ర                                             విజయసాయి రెడ్డి
 గోదావరి జిల్లాలు                               వైవీ సుబ్బారెడ్డి
  కృష్ణా - గుంటూరు                             ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి
  ప్రకాశం - నెల్లూరు - కర్నూలు          వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
 అనంతపురం - చిత్తూరు - కడప       సజ్జల రామకృష్ణా రెడ్డి

 

మరింత సమాచారం తెలుసుకోండి: