క‌రోనా వైర‌స్ దేశంమంతా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వ్యాధి ఇది. మొద‌ట చైనా నుంచి వ్యాపించిన ఈ వ్యాధికి మందు లేక‌పోవ‌డంతో ఇంత మంది భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. అంతేకాక ఇది ఒక ప్రాంణాంత‌క వ్యాధి కావ‌డంతో దీనికి స‌రైన మందు తీసుకురావ‌డానికి ఎంతో మంది వైద్యులు, శాస్త్ర‌వేత్త‌లు దీని పై ప‌ని చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే...ఈ వ్యాధి గాలి ద్వారా ఒక‌రి నుంచి ఒక‌రికి రావ‌డంతో అలాగే అతి వేగంగా మ‌రొక‌రి వ్యాపించ‌డంతో ఎక్కువ‌గా ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఎక్కువ‌గా ర‌ద్దీగా ఉన్న చోటికి వెళ్ళ‌డం మంచిది కాదంటూ వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాక దీని పై చాలా మంది ప్ర‌భుత్వ అధికారులు భ‌య‌ప‌డ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డిక‌క్క‌డ హెల్త క్యాపుల‌ను నిర్వ‌హించి  దీని పై ఓ అవ‌గాహ‌న కూడా తీసుకువ‌స్తున్నారు.  

 

అంతేకాక చాలా మంది ఉద్యోగుల‌కు, స్కూళ్ళ‌కు కూడా సెల‌వులు ప్ర‌క‌టించారు. ఏ మాత్రం కాస్త ద‌గ్గు, జ‌లుబు ఉన్నా కూడా చేతిని అడ్డుపెట్టుకుని ద‌గ్గ‌మ‌ని అలాగే ఏదైన ఒక క‌ర్ఛీఫ్ లేదా ఒక మాస్క్ లాంటిది ఉప‌యోగిస్తే చాలా మంచిద‌ని సూచిస్తున్నారు. ఇవన్నీ వ్యాధి మ‌న ద‌రి చేర‌కుండా ముందుగానే మ‌నం తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌లు అలాగే ద‌గ్గు, జ‌లబు ఏమాత్రం ఎక్కువ‌గా ఉన్నా వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. భోజ‌నం చేసేట‌ప్పుడు కూడా మ‌న చేతుల‌ను ఎంతో శుభ్రంగా క‌డుక్కుని తిన‌డం చాలా మంచిది. చేతికి ఉన్న క్రిముల ద్వారా కూడా మ‌న క‌డుపులోకి వెళ్ళే ప్ర‌మాదం ఉంది. 

 

ఇక చిన్న‌పిల్ల‌ల‌ను స్కూల్‌కి పంపాలంటే ఇటు త‌ల్లిదండ్రులు అదే విధంగా అటు స్కూల్ యాజ‌మాన్యం కూడా భ‌య‌ప‌డుతున్నారు. ఈ వ్యాధి ఎక్క‌డ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సంక్ర‌మిస్తుందోన‌ని ఎవ‌రి ఇళ్ళ‌ల్లో వారు ఉంటే చాలా మంచిద‌ని భావిస్తున్నారు. దీంతో కొన్ని స్కూల్ యాజ‌మాన్యాలు సెల‌వ‌లు కూడా ప్ర‌క‌టించారు.  ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ దీని పై  ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి ఈ నెల 31వ తారీఖు వ‌ర‌కు పాఠ‌శాల‌ల‌కు సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. అంద‌రి మంచి కోరి ఈ నిర్ణ‌యం తీసుకున్నందుకు పిల్ల‌ల త‌ల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: