ఎన్నో ఉత్కంఠ పరిణామాల మధ్య మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ లో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరా వినియోగించారని కేసు నమోదయింది. ఇప్పటికే ఈ కేసులో రేవంత్ అనుచరులు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన రేవంత్ రెడ్డి ని నార్సింగ్ పోలీస్ లు అరెస్ట్ చేసి స్టేషన్ కు పోలీసులు తరలించారు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి హడావుడి తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తోంది. 

IHG


నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించినట్టుగా రేవంత్ పైన, ఆయన సోదరుడి పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దీనిపై ఆర్డీవో విచారణ కూడా పూర్తయింది. వ్యవహారంలోరేవంత్ కు సహకరించారని ఆరోపణలపై  జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర  డ్రోన్ కెమెరా ఎగురవేసి ఆ ప్రాంతాన్ని రేవంత్ ఆదేశాలతో ఆయన అనుచరులు చిత్రీకరించారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి A 1 గా ఉండగా A2 గా కృష్ణారెడ్డి ఉన్నారు. 

IHG


పోలీసులు రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో ఆయనను అరెస్టు చేసి ఐపీసీ184,187 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గండిపేట చెరువు కు వెళ్ళే దారిలో కేటీఆర్ విలాసవంతమైన కట్టుకున్నారని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో దీని నిర్మాణం చేపట్టారని రేవంత్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండడమే కాకుండా పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యవహారాల్లో అరెస్ట్ అవడం  కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: