విజయనగరం జిల్లాలోని  గజపతుల కుటుంబంలో పెద్ద కుదుపు వచ్చింది. దివంగత నేత ఆనంద గజపతిరాజు కూతురు సంచయితా గజపతి రాజు రాత్రికి రాత్రే మాన్సాస్ ట్రస్ట్ భోర్డు ఛైర్ పర్సన్ గాను అంతకు ముందు సింహాచలం దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద కుదుపని అన్నది ఎందుకంటే ఇప్పటి వరకూ టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు దశాబ్దాలుగా ఛైర్మన్ గా ఉంటున్నారు. అలాంటిది అశోక్ కు మాట మాత్రం కూడా తెలియకుండానే ప్రభుత్వం రాత్రికి రాత్రే సంచయితను ఛైర్ పర్సన్ గా నియమించేయటం సంచలనంగా మారింది.

 

ఇంతకీ సంచయిత ఎవరంటే అశోక్ సోదరుడు ఆనంద్ గజపతిరాజు కూతురు+బిజెవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా . బిజెవైఎంలో యాక్టివ్ గా ఉండే సంచయితను ప్రభుత్వం రాత్రికి రాత్రే అందలం ఎక్కించటంలో ఆతర్యం ఏమిటో అర్ధం కావటం లేదు.  ఆమె వైసిపి నేత అయ్యుంటే పార్టీ నేత కోసమే జగన్ ఇదంతా చేసుంటారని సరిపెట్టుకోవచ్చు. కానీ అల అనుకునేందుకు కూడా లేదు ఇక్కడ. పైగా గజపతుల అశొక్ కు వ్యతిరేకంగా సంచయితను ప్రోత్సహించాల్సిన అవసరం కూడా జగన్ కు ఏమిటో అర్ధం కావటం లేదు.

 

అసలు అశోక్ కు వ్యతిరేకంగా సంచయితను ప్రోత్సహిస్తే వైసిపికి వచ్చే లాభం ఏమిటి ? ఇపుడిదే ప్రశ్న పార్టీ నేతల బుర్రలను తొలిచేస్తోంది. శతృవుకు శతృవు మిత్రుడు అన్న సూత్రాన్ని జగన్ పాటించారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. పోనీ అలాగే అనుకున్నా అశోక్  రాజకీయ జీవితం కూడా దాదాపు క్లైమ్యాక్స్ కు వచ్చేసినట్లే. ఇప్పటికే 76 ఏళ్ళున్న అశోక్ వచ్చే ఎన్నికల్లో పోటి చేసేది అనుమానమే. ఇప్పటికే రాజకీయాలకు దూరంగా  ఇంటికే పరిమితమైపోతున్నారు. ఇటువంటి నేపధ్యంలోనే ఇంత తొందరపడి సంచయితను అందలం ఎక్కించారంటే దీని వెనుక ఏదో పెద్ద ప్లానే ఉంటుందనటంలో సందేహం లేదు. కానీ అదేమిటో మాత్రం ఎవరికీ అర్ధం కావటం లేదు. చూద్దాం కొద్ది రోజులు బయటపడకపోతుందా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: