చైనా దేశాన్ని వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాకింది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ ఎంటర్ అవ్వటంతో జనాలంతా బిక్కుబిక్కుమంటున్నారు. మరోపక్క ప్రభుత్వాలు మరియు కేంద్రం కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. దీంతో ఇప్పటికే ఢిల్లీలో మరియు హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో చాలామంది వణికిపోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మరియు గుంపులు గుంపులు గా ఉండే చోటా నడవటానికి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు. ఇదే పరిస్థితి ప్రతిచోట ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే మరణం ఈ ప్రపంచంలో ప్రతి సందులో ప్రతీ దేశంలో మనిషిని గజగజలాడిస్తోంది. ఎవరైనా తుమ్మినా దగ్గినా ఆ ప్రాంతంలో ప్రజలు నడవటానికి భయపడే పరిస్థితి ఏర్పడింది.

 

మరోపక్క మీడియా హడావిడి కూడా బాగా ఉండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి తెగ భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కొన్ని దేశాల్లో అయితే పాఠశాలలకు మరియు ఆఫీసులకు సెలవు ప్రకటించడం జరిగింది. ఈ వైరస్ నుండి బయటపడటానికి ప్రజలు కూడా భారీగా మాస్క్ లు కొనుగోలు చేస్తున్నారు. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో ఈ తరహా అంటు వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

 

శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకుంటే, వ్యాధులు దరిచేరవని ప్రముఖ ప్రకృతి వైద్యులు, మంతెన సత్యనారాయణ రాజు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి రాకుండా ఉండాలంటే, శరీరంలో రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలని అప్పుడే మనకు జబ్బులు దరిచేరవని, విటమిన్ సి మన ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకుంటేనే మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అప్పుడే కరోనా లాంటి మహమ్మారితో పోరాడవచ్చని చెబుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. 

 

 

విటమిన్ సీ రసాయనిక నామం 'ఏస్కార్బిక్ ఆమ్లం'. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో చాలా మాటుకూ మన వంటింట్లో లభ్యం అవుతాయి .. నిమ్మకాయ మన ఫ్రీడ్జి లో సహజంగా ఉంటుంది, ఉసిరి పచ్చడి మన అమ్మమ్మ ని అడిగితే బోలెడంత ఇస్తుంది .. ఆకు కూరలు కూడా అమ్మ లు ఫ్రీడ్జి లో దాచి పెడతారు.. టమాటా పప్పూ మనం తింటూనే ఉంటాము  .. తాజా బంగాళా దుంపలు తింటే కూడా విటమిన్ సీ లభిస్తుంది. ఎంచక్కా మీరు మీ వంటింట్లో ఉన్న సహజ వస్తువుల లోనుంచి ఇవన్నీ తీసుకుని మీ రోగ నిరోధక శక్తి పెంచుకుని తద్వారా కరోనా మిమ్మల్ని తాకినా ధైర్యంగా మీ శరీరం ఎదురుకునేలా చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: