దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న బిజెపి భయంకరమైన నిర్ణయాలు తీసుకుని మరోపక్క అన్ని వర్గాల ప్రజలను వణికిస్తోంది. 2014 మరియు 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి రావడంతో బిజెపి పార్టీ పెద్దలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే మరోపక్క కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ నాయకులు..దేశంలో కాంగ్రెస్ పార్టీ బతకాలి అంటే కచ్చితంగా ప్రియాంక గాంధీ ఎంటర్ అవ్వాలని గత నాలుగు సంవత్సరాల నుండి గొంతు అరిగిపోయేటట్టు కోరుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన రాహుల్ గాంధీ సరైన రీతిలో పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా లేకపోవడమే కాకుండా అందరి ముందు చాలాసార్లు నవ్వుల పాలు కావడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంక గాంధీ తప్ప మరొకరు కాంగ్రెస్ పార్టీని బతికించే పరిస్థితి లేదని చాలామంది అంటున్నారు.

 

గతంలో ఎన్నో సార్లు అవకాశాలు వచ్చినా చాలా దూరంగా ఉన్న ప్రియాంకా గాంధీ ఇటీవల కాలంలో కొద్దికొద్దిగా పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. కానీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని  పునర్నిర్మించే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతానికే తన బాధ్యతలను కుదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు వేదికగా పార్టీ వాయిస్ వినిపించే పనిలోకి అయినా ప్రియాంక గాంధీని దింపాలని పార్టీలోని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలు సైతం ఇందుకు అనుకూలంగానే ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

 

అయితే ప్రియాంక మనసులో ఏముందనే సంగతి మాత్రం తెలియదు. ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక చోట నుండి పెద్దల సభకు ప్రియాంక గాంధీని పంపించాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మరి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పెద్దల పిలుపులుఅందుకుంటుందో లేదో చూడాలి. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇటువంటి గొడవలు ఏమీ లేవని...కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: