ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైసీపీ సర్కారు ప్రయత్నించి విఫలమైంది. ఆ మేరకు ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తేల్చి చెప్పింది. అయితే ఈ జీవోకు వ్యతిరేకంగా కేసు వేసిన బిర్రు ప్రతాపరెడ్డి కేంద్రంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. ఆయన మీ వాడంటే.. మీ వాడు అని రెండు పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి.

 

 

ఇక ఇప్పుడు చంద్రబాబు తన రాజకీయాన్ని మరో లెవల్ కు తీసుకెళ్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో టీడీపీ కేసు వేసింది. ఈ కేసు నూటికి 90 శాతం నెగ్గే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టు గతంలోనే చాలా సార్లు రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని చెప్పేసింది. అయినా సరే టీడీపీ కోర్టుకు వెళ్తుందంటే..అందుకు కారణం రాజకీయమే.

 

 

వాస్తవానికి సుప్రీంకోర్టు ఆదేశానుసారమే హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఇప్పుడు టిడిపి నేతల పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎలాగూ ఆమోదించే అవకాశం లేదు. మరి టీడీపీ ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్లినట్టు... తాము సుప్రింకోర్టుకు వెళ్లామని ప్రచారం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. బీసీల తరపున పోరాటం చేసినట్టు ప్రచారం చేసుకుని దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వాడుకునేందుకు చంద్రబాబు స్కెచ్ వేసినట్టు భావించాలి. ఇక హైకోర్టులో కేసు వేసిన బిర్రు ప్రతాపరెడ్డి వైసీపీ వ్యక్తి అని టీడీపీ ప్రచారం చేస్తోంది.

 

 

అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతాపరెడ్డికి ఉపాధి హామీ డైరెక్టర్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి వైసీపీ వ్యక్తికి చంద్రబాబు పదవి ఇస్తారా..అన్నది జనం ఆలోచించుకోనంత అమాయకులు ఏమీ కాదు కదా. మరోవైపు టీడీపీ సుప్రీంకోర్టుకు వెళ్లడం స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని వైసీపీ అంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: