తెలంగాణాలో కారు స్పీడ్‌ను అందుకోవడానికి ట్రై చేసిన వారంతా వెనకపడిపోయారు.. ఓవర్ స్పీడ్‌తో ట్రాఫిక్ వాళ్లకు కూడా చిక్కకుండా ప్రయాణిస్తున్న కారు పార్టీకి కొత్త కొత్త సమస్యలు తలెత్తుతున్నాయట.. ఈ గులాభిలోని రెక్కలు గుసగుసలు పెడుతున్నాయట.. అధికారంలోకి రాగానే గులాభి బాస్ యజోరుమీదున్న పార్టీలోకి ఆగకుండా వలసల కట్టలను తెంచాడు.. ఇంకేముందు.. ప్రస్తుతం ఉన్న అన్ని పార్టీలనుండి నాయకులు హైస్పీడ్‌తో జంప్ చేసారు.. గులాభి వనం విపరితంగా విస్తరించడంతో అందులో ముసలం మొదలైందట.. దీంతో కారు ఓవర్ లోడ్ అయ్యి కదలలేక పోతుందట..

 

 

ఇకపోతే ప్రస్తుతం ఉన్న పదవులే తక్కువ. ఈ క్రమంలో ఉన్న సీట్లను అందరినీ సర్దుబాటు చేయడం కష్టమవుతోంది. అయినాగానీ సీనియర్లను కాదని...జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. దీంతో జిల్లాల్లో ఇప్పుడు సీనియర్లు వర్సెస్ జూనియర్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితితులు నెలకొన్నాయట.. ఈ పోరులో మంత్రులు మంత్రులకే కాదు.. సీనియర్లకు మంత్రులకు మధ్య ఆధిపత్య పోరు పీక్ స్టేజ్ లో ఉందట.. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్ని తానే అనే విధంగా వ్యవహరిస్తుండటంతో, ఆయనకు పోటీగా మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ఆధిపత్యాన్ని చాటుకోవడం ఇద్దరి మధ్య విభేదాలకు దారితీస్తోంది. ఇదివరకే ఈ విషయం పై హైకమాండ్ కు ఫిర్యాదులందాయిట.

 

 

ఇదేగాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేబినెట్ లో అయితే ఏకంగా నలుగురు మంత్రులు ఉన్నారు. కేటీఆర్ ను పక్కన పెడితే ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ల మధ్య ప్రొటోకాల్ సమస్య పీక్ స్టేజ్ లో సాగుతుందట. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్దితి కొన సాగుతుందట.. అక్కడ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఖమ్మంలో జూనియర్ అయిన మంత్రి పువ్వాడకు, సీనియర్లు తుమ్మల, పొంగులేటి ఇతర ఎమ్మెల్యేల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందట..

 

 

అంతే కాకుండా నల్గొండ జిల్లా రాజకీయాలను పరిశీలిస్తే మంత్రి జగదీష్ రెడ్డికి.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వినిపిస్తుండగా, రంగారెడ్డి జిల్లాలో సబిత, మల్లారెడ్డిల మధ్య పొగలు వెలువడుతున్నాయట.. ఇంతలా లోలోపల కారు ఇంజన్‌లో మంటలు రగులుకుంటున్నాయని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఇలాగే ఆదిపత్యపోరు కొనసాగితే గులాభి పార్టీలో చివరకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారట కొందరు నాయకులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: