ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఇప్పుడు 60 దేశాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌ (కోవిడ్‌-19).. క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాప్తిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. దక్షిణ కొరియాలో ఒక్క రోజులోనే 500 కొత్త కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి.  ఇక భారత దేశంలో కూడా ఈ కరోనా మహమ్మారి భయాందోళనకు గురి చేస్తుంది.  ఓ వైపు కరోనా భయంతో జనాల మద్య తిరగాలంటేనే భయంతో వణికిపోతున్నారు. 

 

ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ తో సినిమా పరిశ్రమ కుదేలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.  ఇప్పుడు ఉపాయం ఉన్నోడు ఊరంత అమ్ముకున్నట్లు కరోనా భయంతో ఉన్న ప్రజలను కొంత మంది కంత్రీగాళ్లు మాయ చేస్తున్నారు.. అందినంత డబ్బు గుంజుతున్నారు.  ముఖ్యంగా మాస్కుల విషయంలో బ్లాక్ మార్కెట్ జరుగుతుందని ఇప్పటికే జనాలు అభిప్రాయ పడుతున్నారు. గ్రామీణ స్థాయిలో కరోనా ఒక మహహ్మారి మంత్రాలు చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు.. లేదంటే చచ్చిపోతారు అంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు. మరికొంత మంది ఇది వాడండి.. అది తాగండి అంటూ కొత్త కొత్త టిప్స్ తో ఊరదగొడుతున్నారు. 

 

అయితే కరోనా లక్షణాలు ఉన్న వారు జ్వరం, దగ్గు, తుమ్ములు, నీరసంగా ఉంటే వెంటనే డాక్టర్ల దగ్గర వద్దకు వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకుంటే మంచిదని అంటున్నారు. అంతే కాదు మోసగాళ్లు ఏం చేసిన వారి మాయలో పడిపోవొద్దు అని డాక్టర్లు, నిపుణులు సూచిస్తున్నారు.  సమాజంలో ఇలాంటి బలహీనతలను ఆసరాగా చేసుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వారు ఎంతో మంది తయారు అవుతున్నారని అంటున్నారు.  మరోవైపు చైనాలో కరోనా తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ భూతం ఇతర దేశాలకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: