ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణ భయంతో వణికిస్తు ... ఇప్పటికే చైనా దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుని మరణ మృదంగం వాయిస్తున్న వైరస్ కరోనా. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ పేరెత్తితేనే ప్రపంచ దేశాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే మొన్నటి వరకు చైనా దేశంలో విజృంభించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ ఇప్పుడు చైనా దేశంలో తగ్గుముఖం పడుతూ ఉండగా మిగతా దేశాల్లో మాత్రం విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 57 దేశాలకు వ్యాప్తి చెందిన ఈ వైరస్... శర వేగంగా వ్యాప్తి చెందుతుంది.ఇక ఈ మహమ్మారి భారతదేశంలో కూడా వ్యాప్తి చెంది అందరినీ ప్రాణభయంతో వణికిస్తుంది. 

 

 

 అయితే ఈ వైరస్ బారినపడి ఇప్పటికే ఎంతోమంది ప్రత్యేక చికిత్స అందుకుంటున్నారు. భారత్ లో  మొత్తంగా 29 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా  కేసులు నమోదవగా రోజురోజుకు కరోనా  అనుమానితులు కూడా పెరిగిపోతున్నారు. అయితే రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి భయపడాల్సిన పని లేదు అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త గగన్ దీప్ కంగ్. ఒక పారాసిట్మల్ టాబ్లెట్ ఒకటి వాడితే కరోనాకు  దూరంగా ఉండొచ్చు అని చెబుతున్నారు. దగ్గు జ్వరం లాంటివి తగ్గడానికి పారాసిటమాల్ టాబ్లెట్ వాడితే సరిపోతుందని.. కరోనా నిర్ధారిత కేసుల్లో కూడా ప్రతి ఐదుగురిలో నలుగురు తమంతట తామే కోలుకుంటున్నారు అంటూ శాస్త్రవేత్త... ఒక్కరు మాత్రమే వైద్యుడిని సంప్రదించాల్సి వస్తుంది అంటూ తెలిపారు. 

 

 

 మనుషులకు  ప్రతి రోజు ఏదో ఒక వైరస్ కి గురవుతూనే ఉంటారని... చేతులను శుభ్రంగా కడుక్కోవడం క్రిముల్ని సంహరించే ద్రవాలతో నేలను శుభ్రం చెయ్యడం లాంటి వాటి వల్ల వైరస్ లకు దూరంగా ఉండవచ్చు అని తెలిపారు. ఇక చేతులను అదేపనిగా ఊరికే ముఖంపై పెట్టకుండా ఉండటమే ఎంతో మేలు అని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రబలుతున్న కరోనా  వైరస్ ఒకప్పుడు వచ్చిన సార్స్  వైరస్ అంతటి ప్రమాదకారి కాదు అని... ఫ్లూ తో పోలిస్తే మాత్రం కరోనా  తీవ్రత కొంత ఎక్కువగానే ఉంది అంటూ తెలిపారు. కరోనా  వైరస్ గురించి బి.పి డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త గగన్ దీప్ కంగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: