.... చివరకు అక్క మొగుడే దిక్కు అన్న సామెతలో చెప్పినట్లుగా చంద్రబాబునాయుడు అంతా తిరిగి తిరిగి చివరకు వామపక్షాలతోనే పొత్తులు పెట్టుకుంటున్నాడు. గ్రౌండ్ లెవల్లో పరిస్ధితి చూస్తుంటే చంద్రబాబుకు వామపక్షాలే దిక్కయ్యేట్లు కనిపిస్తోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తులు పెట్టుకోవటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఒకసారి చర్చలు కూడా జరిగాయి. తొందరలో రెండోదఫా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. టిడిపి ఆఫీసుకు వెళ్ళిన సిపిఐ కార్యదర్శి రామకృష్ణ నేరుగా చంద్రబాబుతోనే చర్చలు జరిపారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరితోనో ఒక్కళ్ళతో పొత్తులు పెట్టుకోకపోతే వామపక్షాల బండి ముందుకు కదలదు. జగన్మోహన్ రెడ్డి ఎలాగూ వీళ్ళను దగ్గరకు రానీయడు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమో వీళ్ళతో సంసారం కుదరదని బంధాన్ని ఏకపక్షంగా తెంచేసుకున్నాడు. ఇక మిగిలింది తెలుగుదేశం మాత్రమే. అంటే ఇటు టిడిపి అయినా అటు వామపక్షాలకైనా వేరే దారి లేకే మళ్ళీ కలుస్తున్నాయన్న విషయం అర్ధమైపోతోంది. చంద్రబాబును నమ్మేందుకు లేదని తెలిసినా మళ్ళీ చంద్రబాబు చంకలో ఎక్కి కూర్చోవటానికి రెడీ అయిపోతున్నాయంటేనే వామపక్షాల పరిస్ధితి ఎంత దయనీయంగా ఉందో తెలిసిపోతోంది.

 

 నిజానికి వామపక్షాలు ఒంటిరిగా పోటి చేసినా టిడిపితో కలిసి పోటి చేసినా పెద్ద ఉపయోగమేమీ ఉండదనే అనుకోవాలి. కానీ పోటి చేయాలంటే అనేక పరిస్ధితులు కూడి రావాలి.  ఎవరితోను కలవకుండా వామపక్షాలు మాత్రమే పోటి చేయాలంటే జోగి జోగి రాసుకున్నట్లే ఉంటుంది. అందుకనే టిడిపితో పొత్తుకు రెడీ అయిపోయారు. ఇదే విషయాన్ని సిపిఐ జాతీయ నేత నారాయణ ’ఇండియా హెరాల్డ్’ తో  మాట్లాడుతూ వామపక్షాలు ఒంటిరిగా పోటి చేసేందుకు భౌతిక పరిస్ధితులు అనుకూలంగా లేవన్నారు.

 

తమకు పవన్ గురించి, చంద్రబాబు గురించి కూడా బాగా తెలుసన్నారు. టిడిపి పరిస్ధితి ఎలాగుందో తమకు తెలిసినా తమ పరిస్ధితి అంతకంటే అన్యాయంగా ఉందన్నారు. ఎలాగూ రామకృష్ణ తన పార్టీతో కన్నా చంద్రబాబుతోనే ఎక్కువ కలుసుంటున్న విషయం కూడా అందరూ చూస్తున్నదే. చంద్రబాబుతో కలిస్తే ఏదో నాలుగు సీట్లు రాకపోతాయా ? అన్న ఆలోచనతోనే కలుస్తున్నట్లు చెప్పారు. ’వ్రతం చెడ్డా ఫలితం దక్కకపోతుందా’ అన్న ఆశతోనే తాము చంద్రబాబుతో కలుస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు. మరి నారాయణ అనుకుంటున్నట్లుగా ఫలితం దక్కుతుందా ? ఏమో డౌటే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: