సాధారణంగా మనుషులకైనా.. పశు పక్షాదులకైనా తోడు అనేది ఎంతో అవసరం అది సృష్టి ధర్మం.  కాకపోతే ఈ తోడు కోసం ఒక్కో జాతిలో ఒక్కో రకంగా ఉంటుంది.  పక్షుల్లో ఒకరం.. జంతువుల్లో ఒకరకంగా తమ తోడు కోసం వెతుక్కోవడం చూస్తుంటాం.  తోడు ఎంత అవసరమో.. ఆహారం కూడా అంతే అవసరం.  అయితే అడవిలో జంతువులు ఆహారం కోసం ఎలా వలస వెళ్తాయో... కొన్ని సార్లు తోడు కోసం కూడా వలసలు వెళ్తుంటాయి. అయితే ఒక మగ పులి మాత్రం తన తోడు కోసం ఏకంగా రెండు వేల కిలో మీటర్లు పయణం చేసి చివరికి తనకు కావాలసిన ఆడపులుల వద్దకు చేరుకుంది.   ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) పర్వీన్ కస్వాన్  ఇటీవల ఓ పోస్ట్ ద్వారా తెలిపారు.

 

  అంతే కాదు ఆ పులి ఎక్కడ ప్రయణం మొదలు పెట్టిందో ఎక్కడెక్కడ తిరిగిందో.. ఎక్కడ విశ్రాంతి తీసుకుందో అనేది మ్యాప్ తో సహా ఆయన పోస్ట్ చేశారు. అతను పులి కదలికను ట్రాక్ చేసే మ్యాప్‌తో పాటు పులి చిత్రాలను పోస్ట్ ద్వారా పంచుకున్నాడు.  ఆ పోస్ట్ లో ఆయన ఈ విధంగా రాసుకుంటూ వచ్చారు.. ఆ పులి  తనకు తోడును కోరుకుంటూ అన్వేషణ ప్రారంభించింది. కాలువలు, పొలాలు, అడవులు, రోడ్లు, గుట్టలు అడ్డొచ్చిన ప్రతిదాన్ని దాటుకుంటూ వెతుకులాడుతోంది.  పగటి పూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రి పూట మాత్రమే నడక సాగించింది. 

 

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌ అభయారణ్యం నుంచి బయలు దేరి జిల్లాలు జిల్లాలు దాటుకుంటూ అలుపెరగకుండా ప్రయాణించి చివరికి ద్యాన్‌గంగా అభయారణ్యానికి చేరుకుంది. అయితే అదృష్టం ఏంటంటే ఆ పులి చేరుకున్న ద్యాన్ గంగా ప్రాంతంలో ఎక్కువ ఆడపులులు ఉండటం విశేషం. మొత్తానికి ఆడ తోడు కోసం ఒక మగపులి పడ్డ కష్టాలు చూసి నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ పులి వద్దకు వచ్చే ఆడపులి నిజంగా అదృష్టవంతురాలు అని ప్రసంశించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: