ఎక్కడా కూడా సహజంగా జరగని ఆత్మహత్య ఇది. కారణం తెలిస్తే షాక్ అవుతారు. తండ్రిలా ఆదరించ వలసిన కోడలిని మామ ఇంత ఘోరానికి పాల్పడతాడా? ఛీ అతని టార్చర్ భరించలేక ఆమె మరణానికి సిద్ధం అయ్యింది  ఆ కోడలు. ఈ ఘటన హైదరాబాదులో జరిగింది. పెద్దలు కూడా మామకి సర్దు చెప్పి అమ్మాయిని కాపురానికి పంపారు. సరేనన్న మామ ప్రవర్తనలో మార్పు లేదు. తట్టుకోలేని కోడలు ఆత్మహత్య చేసుకుంది.

 

అత్తవారింటికి వచ్చిన కోడలిపై కన్ను వేసాడు ఆ దుర్మార్గుడు. కన్న కూతురిలా చూసుకోవలసిన తాను ఆమెపై కన్ను వేసాడు. అతని దుర్బుద్ధిని వివిరించి పెద్దలకి చెప్పింది ఆ కోడలు. పెద్దలంతా కలిసి సర్దు చెప్పారు మామకి. తిరిగి కాపురానికి పంపారు ఆ కోడల్ని. ఇంకేం ఉంది మార్పు లేదు ఆ ప్రవర్తనలో. ఆ  మామ ప్రవర్తనకి బలైపోయింది ఇంటి కోడలు.

 

బషీర్బాగ్లోని పూల్ బాగ్ కి చెందిన ప్రియాంక లోయర్ అక్కడ ట్యాంకుబండ్ గాంధీనగర్ వాస్తవ్యుడైన రమేష్ ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఒప్పించి వారు మూడు ముళ్ళు వేసుకున్నారు. వారి వివాహం అయ్యి ఏడాదిన్నర మాత్రమే అయ్యింది. ఏడు నెలలు పాప కూడా ఉంది. అయితే తండ్రిలా చూసుకోవాల్సిన కోడల్ని సమయం చూసి వేధిస్తూ ఉండేవాడు మామ. ఈ విషయాన్ని పెద్దలకి చెప్పింది ప్రియాంక. విషయం తెలిసిన కుటుంబీకులు పెద్దలతో పంచాయతీ పెట్టారు. నచ్చచెప్పి మళ్ళీ ఆ ఇంటికి పంపారు. 

 

తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ప్రియాంక. రమేష్ ప్రియంకని, కూతుర్ని అత్తా వారింట్లో వదిలి వెళ్ళాడు. జె ఎన్ ఎన్ యూ ఆర్ ఎం ప్రభుత్వ క్వార్ట్రర్స్ రెండో అంతస్తులో తల్లిదండ్రులు ఉండగా మూడవ అంతస్తులో అన్న ఉంటాడు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న సమయంలో ప్రియాంక ఫ్యానుకి ఉరివేసుకుని చనిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: