ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజ్యభ ఎంపి అహ్మద్ పటేల్ అరెస్టుకు రంగం సిద్ధమైందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే విచారణకు హాజరు కావాలంటూ మూడోసారి ఐటి అధికారులు పటేల్ కు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు అందుకున్న పటేల్ రెండు సార్లూ విచారణకు హాజరుకాకుండా తప్పించుకున్నారు. మొదటిసారి నోటిసును పటేల్ లెక్క చేయలేదు. అందుకనే రెండోసారి ఐటి అధికారులు నోటీసులిచ్చారు.

 

ఎప్పుడైతే రెండోసారి కూడా నోటీసులొచ్చాయో అహ్మద్ పటేల్ కు తీవ్రత అర్ధమైపోయింది. అంతే అర్జంటుగా ఊపిరితిత్తుల రోగం వచ్చేసింది. ఇంకేముంది శ్వాస సంబంధమైన అనారోగ్యం పేరుతో అప్పటికప్పుడే ఆసుపత్రిలో చేరిపోయాడు. దాంతో కొద్ది రోజుల తర్వాత ముచ్చటగా ఇపుడు మూడోసారి నోటీసులిచ్చారు. తమ విచారణకు హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సుంటుందనే హెచ్చరికను కూడా జోడించారు.

 

దాంతో ఐటి విచారణను  అహ్మద్ పటేల్ తప్పించుకునే అవకాశం లేకపోయింది. ఒకవేళ తప్పించుకున్నా కోర్టు నుండి అరెస్టు వారెంటుతో వస్తారనే ప్రచారం విపరీతంగా పెరిగిపోతోంది. అసలు అరెస్టుకు భయపడే పటేల్ ఐటి విచారణను తప్పించుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ అహ్మద్ పటేల్ ఐటి విచారణకు హాజరైనా, అరెస్టయినా సంచలనంగా మారుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే అహ్మద్ పటేల్ అన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఎంత కీలకమో అందరికీ తెలిసిందే.

 

చంద్రబాబునాయుడు తరపున ఉత్తరాధి రాష్ట్రాల్లోని ఎన్నికలకు అహ్మద్ వేల కోట్ల రూపాయలను అందుకున్నాడనే ఆరోపణలు వినబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం కర్నాటకలోని ప్రముఖ కాంగ్రెస్ నేత డికె శివకుమార్, చంద్రబాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఐటి అధికారులు చేసిన దాడుల్లో ఆధారాలు దొరికాయట. దాంతో ఐటి దాడులంటేనే అరెస్టు భయంతో వణికిపోతున్నారు. అహ్మద్ పటేల్ విషయంలో ఐటి ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే వ్యవహారాలు చాలా స్పీడయిపోతాయనే ప్రచారం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: