ప్రస్తుతం ప్రపంచంలో వివిధ దేశాల్లో కోరనా (కోవిడ్‌-19 ) వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో పెట్టుబడిదార్లు రక్షణాత్మక పెట్టుబడుల ప్రవాహం సాగుతోంది. దీనితోపాటు దేశవ్యాప్తంగా యస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో పుత్తడి ధర శుక్రవారం కూడా భారీగా పెరిగింది. గురువారం నాడు మల్టీ కమోడిటీ మార్కెట్లో 200 రూపాయిలు పెరిగిన బంగారం ధర శుక్రవారం నాడు ఏకంగా  రూ. 900 పెరిగింది. దీనితో ఇప్పుడు 10 గ్రాముల పసిడి ధర రూ.44,468.00 వద్ద కొనసాగుతోంది. 

 

IHG


ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం ధర అల్‌ టైమ్‌ హై గరిష్టాన్ని నమోదైంది. గత రెండు రోజులుగా పసిడి ధరలు వెయ్యి రూపాయలకు పైగా పెరగడం విశేషం. అయితే ఇప్పుడు నెక్స్ట్   టార్గెట్‌ 45 వేల రూపాయలని, ఇక్కడ ఈ స్థాయిని కొనసాగితే పసిడి పరుగు మరింత వేగం అందుకుంటుందని మార్కెట్ వర్తకులు చెబుతున్నారు.

 

IHG

 

అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా 1,7000 డాలర్ల పైన స్థిరపడితే ఈ ర్యాలీ 1742 డాలర్ల వైపు పయనించే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ ప్రతినిధి హరీష్ ఒక సంధర్బంగా తెలిపారు. 

 

IHG

 

అటు బంగారం ఇకపై పటిష‍్టమేనని ఎస్‌ఎంసి గ్లోబల్ ఒక నోట్‌లో పేర్కొనడం గమనించాల్సిన విషయం. గురువారం నాడు ఆసియా మార్కెట్లతో పాటు అమెరికా ఇండెక్స్‌ లు కూడా 3 శాతం పడిపోవడంతో అంతర్జాతీయంగాను బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. స్పాట్ బంగారం ఒక ఔన్సుకు 1,669.13 వద్ద స్వల్పంగా లాభపడింది. ఇందులో వెండి 0.5 శాతం క్షీణించి ఔన్స్‌ 17.33 డాలర్లకు, ప్లాటినం 0.7శాతం నష్టంతో 858.61 డాలర్లకు చేరాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: