ఇదివరకు కుటుంబ నియంత్రణ విషయంలో పెద్దలు కొందరు ఒక మాట చెప్పేవారు.. అదేమంటే.. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. మూడో బిడ్డ వద్దే వద్దని.. ఒకగానొక సమయంలో టీవీల్లో కూడా ఈ ప్రచారం హోరెత్తేది.. ఇక మన భారతదేశంలో ఈ 'ఇద్దరు పిల్లల చట్టం' అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువని చెప్పవచ్చు.. ఈ చట్టాన్ని గనుక అన్నిరాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేస్తే భారతదేశ జనాభా ఇంతలా పెరిగి ఈ రోజు గుదిబండలా మారకపోయేది..

 

 

ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఒక అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి చేపట్టే ఈ చర్యల్లో భాగంగా ఒక వ్యక్తి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే వారికి సంక్షేమ పథకాలను ఆపివెయ్యాలని యోచిస్తుందట.. ఈ కొత్త జనాభా విధానాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తోందట. ఇందుకు గాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయాలను తెలుసుకోవడానికి ఓ మంత్రివర్గ కమిటీ వేసే ఆలోచనలో ఉందట..

 

 

ఈ మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల జనాభా విధానాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని తెలుస్తుంది.. ఇక నిపుణుల కమిటీలో భాగమైన రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బద్రి విశాల్ మాట్లాడుతూ, దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు తమ జనాభాను నియంత్రించగలిగాయి కానీ, ఉత్తర రాష్ట్రాలు మాత్రం ఇంకా ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నాయి.. అంతెందుకు జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే చిన్న రాష్ట్రాలు అయినా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు లేకుండా చూసుకునేందుకు పథకాలను రూపొందించాయి.

 

 

ఈ రెండు రాష్ట్రాల్లో,ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు... ఇకపోతే ఇదే విధానాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలని యోచిస్తుంది.. ఇందులో భాగంగానే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలతో ఉన్న ప్రజలను రాష్ట్ర సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందటానికి అనుమతించకుండా నిబంధనలు తీసుకుని రాబోతుంది. అలాగే ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిబంధన తీసుకుని వచ్చే ప్లాన్ చేస్తుంది... 

మరింత సమాచారం తెలుసుకోండి: