ఏపీలో మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ కేబినెట్ లో ఇప్పుడున్న మంత్రులంతా రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉంటారని, ఆ తర్వాత కొత్త వారిని నియమిస్తారని మొదట్లోనే జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు కాకుండానే కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంతో ఈ వ్యవహారం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది. 

 

IHG


ఈ వ్యవహారంలో కేంద్రం వైసీపీ నిర్ణయానికి మద్దతు తెలిపితే, శాసన మండలి రద్దు అవుతుంది. అప్పుడు ఈ ఇద్దరు మంత్రులు పదవులు కోల్పోయే అవకాశం ఉంది. వారికి బదులుగా ఇద్దరు బీసీ మంత్రులు తప్పనిసరిగా కేబినెట్ లోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో ఆ అవకాశం తమకే దక్కుతుందని బీసీ ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఇప్పటి నుంచే జగన్ దృష్టిలో పడేందుకు వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జగన్ వైసీపీ కీలక నాయకులు ప్రస్తావించడంతో ఆశావాహులంతా ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

IHG

 

ఏప్రియల్ లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జగన్ కావాలనే సమాచారం లీక్ చేశారనే అనుమానాలు కూడా లేకపోలేదు. మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తారని, ఎవరు ఎక్కువ ఫలితాలు సాధిస్తే వారికి అవకాశం ఉంటుందని, అందుకే 90శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. ఏప్రియల్ లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి..?  ఎవరి మంత్రి పదవులు ఊడతాయి అనే చర్చ వైసీపీలో మొదలయ్యింది. 


ఇప్పటికే కొంతమంది మంత్రులు వ్యవహారశైలిపై జగన్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఖాళీ కాబోయే మంత్రి పదవులు దక్కించుకునేందుకు జగన్ సన్నిహితులతో పాటు కొత్తగా ఎన్నికైన కొంత మంది ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: