పీఎఫ్ అకౌంట్... దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా... ఎందుకంటే ఇది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులందరికి ఈపీఎఫ్ అకౌంట్ సేవలు అందిస్తూ ఉంటుంది కాబట్టి. మాములుగా ఈపీఎఫ్ అకౌంట్‌ కు ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం వాటా ప్రతి నెలా కచ్చితంగా వెళ్లిపోతుంది. అలాగే కంపెనీ కూడా దీనికి సమానమైన మొత్తాన్ని అంటే 12 శాతాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు జత పరుస్తుంది. 

 

IHG

 

మాములుగా ఎవరైనా సరే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్స్‌పై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. ఇంకా ఈపీఎఫ్ అకౌంట్‌‌పై ప్రతి ఏడాది లభించే వడ్డీ మొత్తం, దీనితోపాటు మెచ్యూరిటీ తర్వాత ఈపీఎఫ్ ఖాతా నుంచి విత్‌ డ్రా చేసుకునే మొత్తం పై ఎలాంటి పన్ను ఉండదు. కాబట్టి ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా అధిక మొత్తంలో రైటర్ తర్వాత లబ్ది పొందవచ్చు. ఉద్యోగి శాలరీ ఎక్కువ అయ్యే కొద్ది ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ కూడా పెరుగుతూ వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. నిజానికి కొన్ని రూల్స్ పాటిస్తే కనుక ఈపీఎఫ్ ఖాతాతో అదిరిపోయే బెనిఫిట్స్ ను మనం పొందొచ్చు. ఆ రూల్స్ ఏంటివో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

 

IHG


పీఎఫ్ అకౌంట్ ఉన్నా వారు ముఖ్యంగా ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయినప్పుడు, అలాగే కొత్త జాబ్ నెలలు, కొన్ని సంవత్సరాలపాటు దొరకనప్పుడు ఈపీఎఫ్ అకౌంట్‌ నుంచి డబ్బులు తీసుకొని, ఖాతాను క్లోజ్ చేసుకోవద్దు. ఉదాహరణకి ఉద్యోగం పోయి మూడు నెలలు దాటితే పీఎఫ్ అకౌంట్ నుంచి పూర్తి డబ్బులను విత్‌ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు పీఎఫ్ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవడం వల్ల మీరు వడ్డీ కోల్పోతారు. అంటే మీరు ఉద్యోగం లేకపోయినా కూడా పీఎఫ్ అకౌంట్‌ ను అలాగే ఉంచితే అందులోని డబ్బుకు వడ్డీ కలపబడుతూనే ఉంటుంది.

 

IHG


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) సహా పలు ఇతర ఫిక్స్‌డ్ ఇన్‌ కమ్ అందించే కంపెనీలతో పోలిస్తే ఈపీఎఫ్ అకౌంట్‌పై ఎక్కువ వడ్డీ ఇస్తోంది. దీనితో ఆర్థిక నిపుణులు, ఫైనాన్షియల్ ప్లానర్స్ 12 శాతం కన్నా ఎక్కువ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేసుకుంటే మంచిదని వారి సూచన. ఇందుకోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) ఆప్షన్ ఎంచుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: