స్ధానిక సంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ తేదీలు దగ్గర పడుతున్న నేపధ్యంలో చంద్రబాబునాయుడుపై బిసిల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. జగన్మోహన్ రెడ్డి అమలు చేద్దామని అనుకున్న 34 శాతం రిజర్వేషన్ చెల్లదంటూ ఒకవైపు కోర్టులో కేసు వేయించిన చంద్రబాబు మళ్ళీ సుప్రింకోర్టులో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ అమలు కావాలంటూ కేసులు వేయించటమే విచిత్రంగా ఉంది. అంటే చంద్రబాబులోని స్ల్పిట్ పర్సనాలిటి సంకేతాలు స్పష్టంగా బయటపడిపోయింది.

 

రెండు రకాలుగా చంద్రబాబు వ్యవహరించటం వెనుక బలమైన కారణాలు రెండున్నాయి. మొదటిదేమో జగన్ కు దగ్గరైన బిసిలను మళ్ళీ దూరం చేయటంలో భాగంగా తన దగ్గరకు తీసుకోవటం. అదే సమయంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను సకాలంలో నిర్వహించే అవకాశం లేకుండా చేసి కేంద్రం నుండి రావాల్సిన వేల కోట్ల రూపాయలు రాకుండా అడ్డుకోవటమే. అయితే ఇక్కడ చంద్రబాబుకు అర్ధంకాని విషయం ఒకటుంది.

 

తనదంతా అవుడేటెడ్ ఆలోచనలన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయాడు. ఎప్పుడో ఓన్లీ మీడియా మాత్రమే సమాజాన్ని ఏలుతున్న రోజుల్లో చంద్రబాబు పందంటే పందిగా నందంటే నందిగా చెల్లుబాటైపోయింది. కానీ ఇది సోషల్ మీడియా జమానా అన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయాడు. దాంతో ప్రతి ప్లాన్ ముందే బయటపడిపోవటమే కాకుండా తల్లక్రిందులైపోతోంది. ఇపుడు బిసిల రిజర్వేషన్ల వ్యవహారంలో కూడా చంద్రబాబు ప్లాన్ ఇలాగే బెడిసికొట్టేసింది.

 

దాంతో వివిధ ప్రాంతాల్లోని బిసి సంఘాలు చంద్రబాబుపై మండిపోతున్నారు. తమ రిజర్వేషన్లను చంద్రబాబు అడ్డుకున్నాడన్న విషయం బయటపడటంతో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ దిష్టబొమ్మలను తగలబెడతు తమ ఆందోళనను బయటపెడుతున్నారు. ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అదే సమయంలో బిసిల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో బిసిలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధంకాక చంద్రబాబు, టిడిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే ఆందోళనలు ఎన్నికల నాటికి కూడా మరింత జోరందుకంటే టిడిపి విజయావకాశాలు గోవిందా అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: