మొన్నటివరకు చైనాలో మరణ మృదంగం మోగించిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికీ వివిధ దేశాలలో మాత్రం విజృంభిస్తుంది. తాజాగా భారతదేశంలోకి కూడా ప్రవేశించింది ప్రాణాంతకమైన వైరస్. భారత ప్రజలందరినీ ప్రాణభయంతో వణికిస్తోంది. అసలు ఎవరి బారి నుంచి తమకు కరోనా  సోకుతుందని ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇక అటు కేంద్ర ప్రభుత్వం తో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయిపోయాయి. ఏదైనా ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్ ఎఫెక్టుతో అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా తెలియని స్థితిలో ఉన్నారు. 

 

 

 అయితే ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పాటు ఆర్థిక వ్యవస్థ వ్యవస్థలో కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కరోనా  ఎఫెక్టుతో భారతదేశంలో ఎన్నో కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. అటు  స్టాక్ మార్కెట్లు కూడా కరోనా  ఎఫెక్టుతో కుప్పకూలి పోతుంది. ముఖ్యంగా ఈ కరోనా ఎఫెక్ట్  పౌల్ట్రీ పరిశ్రమ పై ఎక్కువగా కనిపిస్తోంది. కేవలం పౌల్ట్రీ పరిశ్రమ ల ద్వారానే రాష్ట్రం లో వెయ్యి కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ కూడా నిర్ధారించారు. 

 

 

 ఈ నేపథ్యంలో ఈ కరోనా  ఎఫెక్ట్ ద్వారా అటు మంత్రి ఈటల రాజేందర్ కూడా భారీగానే నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి పౌల్ట్రీ పరిశ్రమ లో కొనసాగుతున్నారు ఈటల రాజేందర్. కాగా ప్రస్తుతం కరోనా  ఎఫెక్టుతో పౌల్ట్రీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా నష్టాల పాలు కావడంతో దాదాపు ఎనిమిది కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. చికెన్ తినడం వల్ల కరోనా  వ్యాపిస్తుందని పుకార్లు కూడా మొదలవడంతో... కనీసం చికెన్ వైపు కన్నెత్తి చూసే నాథుడే కరువయ్యాడు. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో ఈ ఎఫెక్ట్ బాగా  పడింది . దీంతో ఈ కరోనా కారణంగా  తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ భారీగానే నష్టపోయినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: