ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే మన దేశంలో కూడా వైరస్ వ్యాపించిందన్న సంగతి విదితమే.. మన దేశ రాజధాని ఢిల్లీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 31కి చేరింది. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి వ్యక్తి థాయ్‌ లాండ్, మలేసియా వెళ్లి వచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ధ్రువీకరించారు. 

 

 

కాగా., దేశంలో తొలి మూడు కరోనా వైరస్ కేసులు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. చైనా నుంచి తిరిగొచ్చిన వీరు వైరస్ సోకడంతో వారు వైద్యపరీక్షలు అందించి వారిని కరోనా బారి నుంచి బయటపడ్డారు. తాజాగా.. వారు మరో రెండు కరోనా కేసులను గుర్తించారు. ఇటలీ వెళ్లి వచ్చిన ఢిల్లీ వ్యక్తికి, దుబాయ్ నుంచి బెంగళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చాడు. ఆ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. 

 

 

అదే రోజు జైపూర్లో ఇటలీ పర్యాటకుడు ఒకరు కరోనా లక్షణాలతో హాస్పిటల్‌ లో చేరగా.. పాజిటివ్ వచ్చింది. అతనితో ఉన్న14 మంది ఇటలీ టూరిస్టులు, భారత డ్రైవర్‌ కు కూడా కరోనా సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారు. వీరు ప్రస్తుతం గురుగ్రామ్‌ లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆగ్రాలో మరో ఆరుగురికి కూడా కరోనా పాజిటివ్ తేలిందని సమాచారం.

 

 

గురువారం ఘజియాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తి ఇరాన్ వెళ్లొచ్చాడు. దీంతో ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో దేశంలో నమోదైన కరోనా వైరస్ కేసుల 30కి చేరింది. తాజాగా నమోదైన కేసుతో కరోనా బాధితుల సంఖ్య 31కి పెరిగింది. మరో 23 మందికి ప్రాథమిక పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని తేలగా.. దీంతో మళ్లీ కన్ఫర్మేషన్ కోసం వీరి శాంపిళ్లను పుణేకు పంపారు. వీరికి కరోనా ఉందని తేలితే.. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని డాక్టర్ల అంచనా..

మరింత సమాచారం తెలుసుకోండి: