మొండివాడు .. ముందు చూపు ఉన్నవాడుగా పేరు ఉన్న టీడీపీ అధినేత  చంద్రబాబు ఆరోగ్యం పై ఇప్పుడు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అప్పట్లో అమెరికాకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారని, ప్రచారం జరిగింది. అమెరికా నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు బాగా యాక్టివ్ గా కనిపించారు. అయితే అమెరికాలో డాక్టర్లు చంద్రబాబును ఇక విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని, లేకపోతే తిరిగి మళ్ళీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారట. కానీ ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం, తర్వాత పార్టీని ధైర్యంగా, సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకులు లేకపోవడం తో చంద్రబాబు ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండానే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. 

 

IHG


ఇక అప్పటి నుంచి విసుగూ, విరామం లేకుండా తొమ్మిది నెలలుగా జనాల్లో తిరుగుతున్నారు. మూడు రాజధానుల వ్యవహారంతో పాటు ఏపీ లో నెలకొన్న అన్ని ప్రజా సమస్యల విషయంలోనూ చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొంటూ, పార్టీ శ్రేణులను ఉత్తేజ పరుస్తున్నారు. ఆవిధంగా చేయకపోతే టిడిపి ఏపీలో కనుమరుగైపోతుందన్న భయం చంద్రబాబులో బలంగా ఉంది. అందుకే తన వయసు సహకరించకపోయినా, ఏదో ఒక ఆందోళనతో నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన ప్రజా చైతన్య యాత్ర ద్వారా ఏపీలో అన్ని ప్రాంతాల్లో తిరగడమే కాకుండా, పార్టీకి మైలేజ్ వచ్చేలా, వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఏపీలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఆ విధంగానే విశాఖలో కూడా ప్రజా చైతన్య యాత్ర ద్వారా చేరుకున్నారు. 


 మూడు రాజధానుల ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకించడం, విశాఖను రాజధానిగా ఒప్పుకోకపోవడంతో, స్థానిక ప్రజల నుంచి చంద్రబాబుకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. అంతేకాకుండా చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుపడ్డారు. దీంతో చంద్రబాబు తన యాత్రను ముగించేశారు. ఇక అప్పట్నుంచి జనాల్లో కూడా తిరిగేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. ఈ విధంగా అయినా ప్రజల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు భావిస్తూనే మరోవైపు తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో విశ్రాంతి కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక సంస్థల మొదలు కాబోతున్న నేపథ్యంలో ధైర్యం నింపేందుకు మళ్ళీ జనాల్లోకి రావడమా లేక విశ్రాంతి తీసుకుంటూనే పార్టీ నాయకుల ద్వారా తన వ్యూహాలను అమలు చేయాలని చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: