చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇటీవ‌ల ఇలాంటి వ‌రుస ఘ‌ట‌న‌లు చూస్తుంటే..  మనిషిలోని మానవత్వం నిజంగానే మాయమైపోతుందా..? వాయి వరుసలు మర్చిపోయి మనిషి మృగంలా మారిపోతున్నాడా ? అన్న భయం కలుగుతోంది. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో ఉండగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అయిన‌ప్ప‌టికీ నేరాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంధులు కామ వాంఛ తీర్చుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు కొంద‌రు మాన‌వ మృగాలు. ఇక మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అమెరికాలో చదువుతున్న ఓ భారతీయ విద్యార్ది నేరం చేసినట్టు రుజువైంది. 

 

దీంతో అత‌డికి క‌ఠిన శిక్ష ప‌డే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సచిన్ అజీ భాస్కర్ అనే భారతీయ విద్యార్ధి స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లి, న్యూయార్క్‌ బఫెలో సిటీలో నివసిస్తున్నాడు. అక్క‌డ భాస్కర్ ఓ 11 ఏళ్ల మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చూస్తే వ‌చ్చేవాడు. తనతో శృంగారంలో పాల్గొనాల్సిందిగా ఈ మెయిల్, సోషల్ మీడియా ద్వారా స‌ద‌రు బాలిక‌ను హింసించేవాడు. ఈ క్ర‌మంలోనే 2018లో ఓ రోజు కారులో  బాలికను తీసుకువెళ్లి ఆమెపై దాదాపు మూడు గంటల పాటు లైంగిక దాడి జరిపి ఇంటికి వ‌చ్చాడు.

 

అయితే  ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చైల్డ్ ఎక్స్‌ప్లోయిటేషన్ టాస్క్‌ఫోర్స్ జరిపిన విచార‌ణ‌లో భాస్కర్ భాగోతం బ‌య‌ట‌పడింది. దీంతో మైనర్ తో శృంగారంలో పాల్గొన్న విషయాన్ని అతను సీనియర్ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియమ్ ఎం స్క్కెట్నీ అంగీకరించాడు. ఇక ఈ సంఘటనలో సచిన్ అజీ భాస్కర్ దోషిగా తేల‌డంతో.. స‌ద‌రు వ్య‌క్తికి 10 ఏళ్ల జైలు శిక్ష.. 2,50,000 అమెరికన్ డాలర్ల జరిమానా రెండూ విధించనున్నట్టు యు.ఎస్. అటార్నీ జేమ్స్ కెన్నడీ తెలిపారు. ప్ర‌స్తుతం తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 17కు వాయిదా వేసింది. అయితే జూన్ 17నే సచిన్ అజీ భాస్కర్ శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: