వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతి కర్ర సాయంతో మీడియాలో కనిపించారు. కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఆయన నడవలేక నడుస్తున్నట్లు కనిపించారు. కాగా., ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లి గ్రామంలో ఒక వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్లి పూర్తి అయిన సమయంలో వధూవరులను ఆశీర్వదించడానికి వేదిక పైకి వెళ్లారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. ఆ సమయంలో ఆయన కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రామకృష్ణా రెడ్డిని పైకి లేపారు.

 

 

దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కుడి కాలి పాదానికి గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ చికిత్స అందించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆయన కాలు కాస్త బెణకడంతో కట్టు కట్టాల్సి వచ్చిందని డాక్టర్ తెలిపాడు. నిన్నటి వరకు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇటు ఈ ప్రమాదం గురించి తెలియగానే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు కంగారు పడ్డారు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

 

 

ఆ గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతికర్ర సాయం తీసుకుని నడవటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబోలు. అయితే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఫోటోలు వైరల్ కావడంతో.. ఈ విషయం తెలిసిన వాళ్లు ఎమ్మెల్యే ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీస్తున్నారు. తెలియని వాళ్లు ఏమైందని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కానీ.. టీడీపీ కార్యకర్తలు మాత్రం ఆళ్ల రామకృష్ణారెడ్డి ను ట్రోల్ చేస్తున్నారు. దెబ్బతగిలిన కాలి పై బరువు ఎలా పెడతారని ఆయనను ప్రశ్నిస్తున్నారు. దెబ్బ తగిలిందా లేదా నాటకాలు వేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

 

 

ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పరామర్శించి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: