సోషల్ మీడియా దెబ్బంటే ఏమిటో చంద్రబాబునాయుడుకు బాగా రుచి తగులుతున్నట్లే ఉంది. మామూలుగా ప్రత్యర్ధులను గబ్బు పట్టించటంలో తెలుగుదేశంపార్టీకి మించిన పార్టీ లేదనే చెప్పాలి. ఎలాగూ బలమైన మీడియా మద్దతుంది కాబట్టి ప్రత్యర్ధులపై చంద్రబాబు, టిడిపి నేతలు రెచ్చిపోతుంటారు. 2014 ఎన్నికల సమయంలో కూడా ఇదే పద్దతిలో జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు బాగానే బురద చల్లేసి విజయం సాధించాడు. కానీ ఐదేళ్ళు గడిచేటప్పటికి మొత్తం సీన్ రివర్సయిపోయింది.

 

ఇదంతా ఎందుకంటే తాజాగా మొదలైన బిసిల రిజర్వేషన్ వ్యవహారమే తీసుకుందాం. బిసిలకు ఉన్న 34 రిజర్వేషన్ అమలు కాకుండా చంద్రబాబే తన మద్దతుదారుడు బిర్రు ప్రతాప్ రెడ్డితో హై కోర్టులో కేసు వేయించాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చింది. తీర్పును అడ్డం పెట్టుకుని జగన్ ను మ్యాగ్జిమమ్ గబ్బు పట్టిద్దామని చంద్రబాబు, టిడిపి నేతలు, పచ్చమీడియా ప్లాన్ సోషల్ మీడియా వల్లే తల్లకిందులైపోయింది.

 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు తీర్పిచ్చిన గంటల వ్యవధిలోనే అసలు ప్రతాప్ రెడ్డి ఎవరు ? ఎక్కడి వాడు ? ఏ పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటున్నాడు ? ఎవరి ప్రభుత్వంలో పదవులు అందుకున్నాడు ? లాంటి పుట్టుపూర్వోత్తరాలను సోషల్ మీడియానే జనాల ముందుంచింది. దాంతో జగన్ పై బురద చల్లాలని వేసిన ప్లాన్ చివరకు రివర్సయి చంద్రబాబు, టిడిపి నేతల మీదే పడింది. దాంతో  ఆ బురదను కడుక్కోవటానికి వాళ్ళే నానా అవస్తలు పడుతున్నారు.

 

జగన్ పై పచ్చమీడియా చల్లుతున్న బురదను కూడా సోషల్ మీడియానే అడ్డుకుంటోంది. ఏ విషయంలో కూడా కానీండి చంద్రబాబు నుండి కామెంట్లు రావటం ఆలస్యం సోషల్ మీడియా రెచ్చిపోతోంది. మొన్నటికి మొన్న ప్రభుత్వం అమ్ముతున్న మద్యం బ్రాండ్లపై బోండా ఉమ పెట్టిన ప్రెస్ మీట్ వివరాలను కూడా సోషల్ మీడియానే చీల్చి చెండాడేసింది. వాస్తవం చెప్పాలంటే సోషల్ మీడియా ముందు సాక్షి మీడియా కూడా పనికి రావటం లేదనే చెప్పాలి. ఇటువంటి సోషల్ మీడియా లేకపోతే వైసిపి ప్రభుత్వం పరిస్ధితి ఏమిటో ?

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: