జె. కె. రౌలింగ్ యొక్క విజయ కథ చాలా అద్భుతమైనది. కానీ ఈ అపారమైన విజయం వెనుక ఆమె చాలా బాధలు కష్టాలను అనుభవించింది. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం కావున ప్రపంచంలో మొట్టమొదటి బిలియనీర్ రచయిత యొక్క పూర్తి జీవితాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.


తల్లి మరణం తరువాత ఆమె తన జీవితం మార్చుకోవడానికి పోర్చుగల్ వెళ్లి ఇంగ్లీషును విదేశీ భాషగా చాలా పట్టుదలతో నేర్చుకుంది. 1992 లో ఆమె పోర్చుగల్ టీవీ జర్నలిస్ట్ జార్జ్ అరాంటెస్‌ను వివాహం చేసుకుంది.

ఆమె గర్భవతి అయి, జెస్సికా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ ఆమె వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు.13 నెలల తర్వాత మాత్రమే ఆమె అతనిని విడాకులు తీసుకొని కేవలం తన తో పాటు ఆమె కుమార్తెని, ఇంకా ఆమె రాసుకున్న "హ్యారీ పాటర్" యొక్క మొదటి మూడు అధ్యాయాలతో ఎడిన్బర్గ్కు వెళ్ళింది.


1993 చివరి నాటికి, పరిస్థితులు ఆమెకు మరింత దయనీయంగా మారాయి. ఆమె ఇరుకైన అపార్ట్మెంట్లో నివసిస్తూ తన బిడ్డను ఒంటరి గా సాధించింది. ఆ సమయంలో ఆమె చేతిలో డబ్బు లేదు, అలాగే ఆమెకు పర్మనెంట్ జాబ్ ఏమి దొరకలేదు.




కానీ ఆమె రాసిన హ్యారీ పాటర్‌ స్టోరీస్ ప్రపంచం మొత్తం పెద్ద దుమారం రేపాయి. నిజం చెప్పాలంటే ఆమె మూడవ, నాల్గవ ఎడిషన్ అన్ని రికార్డులను బద్దలుకొట్టాయి. ఆమె ఏడు పుస్తకాల సిరీస్ అప్పటి నుండి 450 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడైంది, ఇది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది.



తరువాత, వార్నర్ బ్రదర్ మొదటి రెండు నవలల చిత్ర హక్కులను $ 1.5 మిలియన్లకు కొనుగోలు చేశాడు. 2011 లో ఫోర్బ్స్ ఆమె మొత్తం విలువ 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది అది ఆమెను ప్రపంచ సంపన్న రచయితగా చేసింది. ఏదేమైనా ఒక మహిళా రచయిత దరిద్రం నుండి బయటపడి బిలియనీర్ అయ్యి చాలా మంది మహిళలకు స్ఫూర్తిదాయకం అయింది.




ఆమె నేటి తరం యువతకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె తన తల్లి మరణించినా, భర్త తో విడాకుల అయ్యినా, డబ్బులు లేని సమయంలో తనకి బిడ్డ బాధ్యత ఉన్నప్పటికీ ఆ మాత్రం తనకి మిక్కిలి యిష్టమైన రైటింగ్ ప్యాషన్ ని మాత్రం అస్సలు వదులుకోలేదు. ఎంతమంది పబ్లిషర్లు తన కథలను రిజెక్ట్ చేసిన ఆమె మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా గా ట్రై చేస్తూ చివరికి ప్రపంచంలోనే అతి గొప్ప రచయితగా పేరు పొందింది. అందుకే మనకి ఇష్టమైన దానిని ఏ సందర్భంలోనూ వదులుకోకుండా నిరుత్సాహపడకుండా మనవంతు మనం రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో అతి గొప్ప స్థానానికి చేరుకున్న అవకాశం ఉంది. J

మరింత సమాచారం తెలుసుకోండి: