"ఆడదానికి ఆడదే శత్రువు!" అనే సామెత గురించి అందరికి తెలిసినదే. పైగా ఈ డైలాగ్ ని సందర్భాన్ని బట్టి బాగా వాడుతారు మనవాళ్ళు. ఇక సీరియల్స్ మరియు సినిమాలలో ఐతే ఇక చెప్పనక్కర్లేదు, వీలునుబట్టి నటి-నటులు ఈ డైలాగ్ ను బాంబ్ లా పేలుస్తుంటారు. దురదృష్టమేమంటే, ఈ మాటని మగవాళ్ల కంటే కూడా ఆడవారే ఎక్కువ వాడటం మనం గమనించవచ్చు. అయితే ఇంతకీ ఇందులో నిజమెంత? నిజంగా ఆడవాళ్లు అంత అసూయా పరులా? స్వల్ప బుద్ధి గలవారా??

 

IHG

 

అయితే అదంతా వట్టి బూటకమని కొట్టి పారేస్తున్నారు స్త్రీవాద ఉద్ధారకులు. వాస్తవానికి ఆడదానికి ఆడది శత్రువు కాదని, ఓ మంచి స్నేహితురాలు అని వారు వాదిస్తున్నారు. సాటి స్త్రీని సరిగ్గా అర్థంచేసుకునే మనసు సాటి మగువకే ఉంటుందని, అటువంటి నిర్మల హృదయం వారికే ఉంటుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు. కాకపోతే, మాములుగా మన పితృస్వామ్య సమాజం అలా కుట్రపూరితంగా మాట్లాడుతుందే తప్ప, అది నిజం కాదని బలంగా చెప్తున్నారు.

 

ఇంతకీ ఈ మాట వాడుకలోకి రావడానికి కారణం ఆలోచిస్తే.. మనకు కొన్ని అస్పష్టమైన కారణాలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. సహజంగా మన ఇళ్లల్లో ఆడపిల్ల బాధ్యత తల్లిపైనే ఎక్కువగా ఉంటుంది. కూతురుకు సంబంధించిన తప్పొప్పుల విషయాల్లో తల్లే న్యాయవాదిగా కనబడుతుంది. దీనివల్ల తల్లీకూతుళ్ల బంధంలో కొంత విముఖత ఏర్పడుతుంది. ఇక మన వివాహ వ్యవస్థలో కోడల్ని స్వీకరించే తీరులో ఎంత మార్పు ఉంటుందో, ప్రత్యేకించి ప్రస్తావించాల్సినవసరంలేదు. ఇలాంటి చాలా విషయాల్లో ఒక స్త్రీని మరో స్త్రీ ట్రీట్ చేసే విషయమే తప్ప అది వారి సహజమైన వ్యక్తిత్వం కాదు అనేది వారి విశ్లేషణ!

 

IHG

 

ఇక నిజా నిజాలను మనం పరిశీలించి చూస్తే.. ఈ మాటలో వాస్తవం లేనే లేదని తెలుస్తుంది. గత రెండు దశాబ్ధలుగా ఆడవారి జీవితాల్లో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్త్రీలు విద్యకు చేరువవుతున్నారు. విజ్ఞాన రంగంలో అభివృద్ధిని సాధిస్తున్నారు. ఈ స్థితిలో ఇలాంటి అపోహలను మూలంగా తీసుకుంటే వారి పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి సామెతలకు పూర్తిగా చెక్ పెడితేనే బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: