పాపికొండలు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతం. రెండు కొండల మధ్య గోదావరి గలగల పారుతూ ఉంటే... దేశంలోని ఎంతో మంది పర్యాటకులు అక్కడికి చేరుకుని.. బోటులో ప్రయాణిస్తూ రెండు కొండల మధ్య ఉన్న ప్రకృతి అందాలను తిలకిస్తూ గోదావరి సవ్వళ్లను చూసి ఆనంద పడుతూ... అక్కడి తీర ప్రాంతాల్లో బస చేస్తూ ఎంతో మురిసి పోతూ ఉంటారు. ఈ ప్రయాణం ఒక మధురమైన నటువంటి అనుభూతి. అందుకే సుదీర్ఘ కాలం నుంచి ఇక్కడికి లక్షలాది మంది పర్యాటకులు వచ్చి పాపి కొండల అందాలను తిలకిస్తూ ఉంటారు. అయితే దీని గురించి ప్రస్తుతం ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే.. పోలవరం ప్రాజెక్టు కడితే పాపికొండలు కనుమరుగవుతాయి అన్నది పలువురు చర్చించుకుంటున్నారు మాట. వాస్తవానికి అయితే పోలవరం నిర్వాసితులు అందరూ పాపి కొండల పైన జీవనం సాగిస్తున్నారు. 

 

 అంటే రాబోయే కాలంలో ముంపుకు గురవుతున్న ప్రాంతంలో వేలాది మంది నివసిస్తున్నారు. ఇక ఎక్కువమంది టూరిజం మీదనే బతుకు బండిని నడిపిస్తున్నారు. గోదావరి నుండి భద్రాచలం వరకు లేకపోతే అటు నుంచి ఇటు పర్యాటకులను తీసుకొచ్చి ఇదే జీవనాధారంగా బతుకుతున్నారు. ఇదే సమయంలో మధ్యలో చిన్న చిన్న హోటళ్లు భోజనశాలలు ఇక బోర్డుల్లో కూడా చిన్నచిన్న భోజనశాలలు ఇలా వీటిపైనే అక్కడి ప్రజలందరూ జీవనం సాగిస్తున్నారు. కానీ ప్రస్తుతం అక్కడి ప్రజలు మాత్రం ఉపాధిలేక అల్లాడిపోతున్నారు. ఎందుకంటే గత కొంతకాలం క్రితం గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

 

 ఈ ఘటనలో ప్రతిపక్ష అధికార పక్షం మధ్య ఎన్నో ప్రతివిమర్శలు విమర్శలు కూడా జరిగాయి. అయితే ఈ బోటు పై జగన్ సర్కార్ సరి కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతకుముందు వరకూ ఎలాంటి పర్మిషన్ లేకుండా బోట్లు గోదావరి నది లోకి వెళుతున్న సందర్భంలో... సరి కొత్త నిబంధనలను తెరమీదికి తెచ్చింది జగన్ సర్కారు. గోదావరి పర్యటనకు వెళ్లే బోర్డు రిజిస్ట్రేషన్ తో పాటు అక్కడున్న వాటర్ ఫ్లో ని బట్టి అనుమతించాలి... అంతేకాకుండా ఎంతో అనుభవం గల డ్రైవర్లు మాత్రమే బోట్  నడపాలని... ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఒక కంట్రోల్ రూమ్ ద్వారా బోట్లలో జిపిఎస్ కూడా మానిటర్ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు.

 

 ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి బోట్ సేవలన్నీ నిలిచిపోయిన నేపథ్యంలో... అక్కడి ప్రజలు అందరికీ ఉపాధి కరువైంది. ముంపు ప్రాంతంలో పంటలు వేసుకున్న ఉపయోగం లేదు... ప్రస్తుతం ఉన్న టూరిజం ఉపాధి ఆగిపోయింది.. వేరే ప్రాంతానికి వెళ్లాలంటే.. ప్రజలకు ఇస్తామన్న పునరావాస ప్యాకేజీ ఎక్కడ దక్కకుండా పోతుందేమోనన్న భయం.. ఇలా జీవన ఉపాధి కరువై ఎటూ తేల్చుకోలేని దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు అక్కడి ప్రజలు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దుస్థితిని గమనించి... పునరావాసం తో పాటు ఉపాధి కూడా కల్పించాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: