ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై,దివంగత వైయస్సార్‌ను అగౌరవపరిచే విధంగా ప‌దే ప‌దే మాట్లాడుతున్న దేవినేని ఉమ ఇకపై ఆ వైఖరి మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ హెచ్చరించారు. లేకపోతే తాము కూడా చంద్రబాబు గురించి అదే స్దాయిలో మాట్లాడాల్సివస్తుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరులు సమావేశంలో వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేవినేని ఉమలాగా తాము కూడా చంద్రబాబుపై మాట్లాడవచ్చని అయితే.... దేవినేని ఉమలాగా  తాము సంస్కార హీనులం కాద‌ని అన్నారు. 

 


ప్రజలతో తిరస్కరించబడిన  దేవినేని ఉమ లాంటి వ్యక్తులు పదే పదే జగన్ గారి గురించి స్దాయి మరిచి అభ్యంతరకరంగా మాట్లాడుతుంటే త‌మకూ స్పందించ‌క‌ తప్పట్లేద వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ అన్నారు. ``వైయస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ కూడా వరుసగా నెరవేరుస్తుంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి పథ‌కాలకు ప్రజల ఆదరణ లభిస్తుండటంతో టీడీపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు` అని అన్నారు.

 

దేవినేని ఉమ మెంటల్ ఆస్పత్రిలో చేరే రోజు వచ్చిందని వ‌సంత ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు వైజాగ్ మెంటల్ ఆస్పత్రిలో గది కేటాయించాల్సిన పరిస్దితి అని ఎద్దేవా చేశారు. ``తను పోటీ చేసిన నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం పేరు చెప్పలేని వ్యక్తి లోకేష్. అలాంటి లోకేష్‌ను జగన్‌తో పోలుస్తావా?పోటి చేసిన నియోజకవర్గంలోనే గెలవలేని వ్యక్తి లోకేష్ .వైయస్ జగన్ 151 నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వ్యక్తి`` అని వ‌సంత ప్ర‌శ్నించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఉగాది పండుగ ముందే వచ్చిందని వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పేర్కొన్నారు. ``26 లక్షలమందికి ఇంటిపట్టాలు ఇవ్వబోతున్నారు.ఇది ప్రణాళికా బద్దంగా చేసిన పని కాబట్టి పేదలందరి ఇళ్లల్లో పండుగ వాతావరణం రాష్ట్రంలో ముందే వచ్చింది. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఐదేళ్లు అవినీతి విధానాలతో నీలాంటి టీడీపీ నేతలందరూ దోచుకున్నారు కాబట్టే మీకు అతీగతీ లేకుండా అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేకుండా పోయింది. ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్లకు తగిన బుద్ది చెప్పారు. ఉదయం, సాయంత్రం జరిగే ప్రెస్ మీట్లతో ప్రజలు విలేకరులు విసిగి వేసారిపోయారు. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టింది. రానున్న ఎన్నికలలో నీ పార్టీ కనిపించకుండా పోతుంది. నీకు ఏ విలువలు లేవు. దేవినేని ఉమా....నీ వదినను తడిగుడ్డపెట్టి చంపేసినవాడివి. నీ అన్నా, నీవు కలసి మీకు రాజకీయభిక్షపెట్టిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేసినవాళ్లు. నీలాంటి వాళ్లు అందరికి వెన్నుపోటు పొడిచారు.`` అని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: