తమ పిల్లలు ఎంతో బాగా చదువుకొని అత్యున్నత స్థాయికి ఎదుగుతారని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తే... క్షణికావేశంలో నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను బలి తీసుకుంటూ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. బిటెక్ విద్యార్థి బాత్రూం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఆ విద్యార్ధి కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వర్ధన్నపేట కు చెందిన అనూష  అనే యువతి తిమ్మాపూర్ సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. 

 


 ఈ క్రమంలోనే తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువు కొనసాగిస్తుంది సదరు యువతి. అయితే తాజాగా శుక్రవారం అనుష తరగతులకు హాజరు కావడంతో కళాశాల ప్రతినిధులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా తల్లిదండ్రులు... అనుష కి కాల్ చేశారు. ఇక ఫోన్ స్విచాఫ్ రావడంతో హాస్టల్ వార్డెన్ కి ఫోన్ చేయగ... అనూష  మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు అంటూ హాస్టల్ సిబ్బంది తెలిపారు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు ఒకసారి హాస్టల్లో చూడాలంటూ హాస్టల్ సిబ్బందిని కోరారు. 

 


 ఈ క్రమంలోనే అనూష ఉండే రూమ్ వద్దకు వెళ్ళగా లోపలనుండి గడె పెట్టి ఉంది... దీంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా.. బాత్రూంలో ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించిన అనూషను  చూసి హాస్టల్ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కి  గురయ్యారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూడక అనూష చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. ఇక చున్నీ జారి ఆమె శరీరం నేలకు తాకింది. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకున్న హాస్టల్ సిబ్బంది... పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇక సంఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: