మామూలుగా అయితే ఎక్కడైనా మరుగుదొడ్లు ఉన్నాయి అనుకోండి అక్కడ ఏం రాసి ఉంటుంది. పురుషులు స్త్రీలు అని  రాసి ఉంటుంది. అంటే పురుషుడు అని రాసిన వైపు పురుషులు మరుగుదొడ్లు ఉన్నాయని స్త్రీలు అన్ని రాసిన వైపు స్త్రీల  మరుగుదొడ్లు ఉన్నాయి దాని అర్థం. కానీ ఇక్కడ మరుగుదొడ్లపై  రాసినది చూసి మాత్రం అందరూ అవాక్కవుతున్నారు. అక్కడ ఏం రాసి ఉందో తెలుసా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే. ఇది ఇప్పుడు నుండి  కొనసాగుతున్నది కాదు... ఎన్నో ఏళ్ల నుంచి  కొనసాగుతున్నప్పటికీ తాజాగా ఓ  స్టూడెంట్ కారణంగా ఇది తెర మీదికి వచ్చి సంచలనంగా మారింది. 

 

 కేరళ త్రిసూర్ ఏరియా కుట్టు ముక్క మహాదేవ ఆలయంలో  ఏదో చిన్న గుడి లో ఉత్సవం  జరుగుతుంటే రీసెర్చ్  చేయడానికి వచ్చిన జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళాడు... వెంటనే టాయిలెట్ వెళ్లాలి అని భావించి గుడి వెనుక కి వెళ్ళాడు కానీ అక్కడ మాత్రం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే అని రాసి ఉంది దీంతో.. షాక్ అయిన ఆ స్టూడెంట్ అక్కడున్నది ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ మరుగుదొడ్లు 25 ఏళ్ల నుంచి ఇలాగే కొనసాగుతున్నాయి.కమిటీ  సోషల్ మీడియాలో ఆ యువకుడు ఫోటో పోస్ట్ చేయడంతో వెంటనే వివిధ రాజకీయ పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. రాజకీయ నాయకులు గుడి నిర్వహకులను  ప్రశ్నించడంతో.. అక్కడున్న బోర్డును పీకిపారేసారు. 

 


 అయితే ఇక్కడితో ఈ వ్యవహారం ఆగిపోలేదు... ఆ గుడి  వ్యవహారం కోసం కమిషనర్ జై కుమార్ ను.. దర్యాప్తు కోసం పంపించగా... ఇక్కడ సమస్య పరిష్కారం అయిపోయిందని ఇంకా దర్యాప్తు ఎందుకు అని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ విషయంపై తాజాగా సంచలనం రేపటంపై  అటు ఆలయ నిర్వాహకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎవరో  ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసి ఉంటారు అని అనుకుంటున్నారు. ఏదో కుట్ర జరుగుతుందని అనుకుంటున్నారు. ఈ విషయం మా దృష్టికి తీసుకువస్తే అయిపోయేది కదా సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది... అని ఆలోచించిన నిర్వాహకులు ఇంత రచ్చ కు దారితీసిన రీసెర్చ్ స్టూడెంట్  పై  కేసు పెట్టాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: