మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా పరిపాలన, అభివృద్ధి  వికేంద్రీకరణ చేయాలని భావిస్తోన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరెన్ని విమర్శలు చేసిన లెక్కచేయడం లేదు . అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను వీలైనంత త్వరగా విశాఖ కు తరలించాలని భావిస్తున్నారు . స్థానికంగా మధురవాడ లోని  మిలీనియం టవర్స్ వేదిక ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు  రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సన్నాహాలు చేస్తుంటే  , మరొకవైపు ఐటీ కంపెనీల అభ్యంతరాలు , విపక్షాల విమర్శల నేపధ్యం లో ప్రభుత్వ పెద్దలు  మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది . విశాఖ లో  సచివాలయం తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట నిర్మించాలని డిసైడ్ అయినట్లు సమాచారం .

 

ఈ మేరకు  ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అనువైన స్థల  ఎంపిక కూడా  జరిగిపోయినట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. విశాఖలోని కాపులుప్పాడ కొండ పై  1350 ఎకరాల్లో సచివాలయం తోపాటు , ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లుగా కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది . కాపులుప్పాడ కొండ ను గత టీడీపీ ప్రభుత్వం హయాంలో లే అవుట్ వేసి అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు కేటాయించాలని నిర్ణయించింది  . స్థానికంగా డేటా పార్క్ ఏర్పాటుకు తొలుత గౌతమ్ అదానీ ఆసక్తి ప్రదర్శించారు . దీనితో అదానీ కి స్థలం కేటాయించేందుకు టీడీపీ సర్కార్ ముందుకు వచ్చింది .  70 వేల కోట్ల రూపాయలు వెచ్చించి డేటా పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పిన అదానీ ,ఆ  తరువాత కేవలం మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మొగ్గు చూపడంతో చంద్రబాబు సర్కార్ కూడా వెనక్కి తగ్గింది .

 

 అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని జగన్ సర్కార్ నూతన సచివాలయం , ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది . అయితే ఇందులో నిజ, నిజాలు ఏమిటన్నదానిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తే తప్పా తెలిసే అవకాశం లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: