తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత బట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సమావేశాలు జరిగే రోజులను పెంచాలంటూ కేసీఆర్ ను  డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన నువ్వు మాట్లాడుతుంటే నీ వెనకాల మీ ఎమ్మెల్యేలే  ఉండరు. ఇంకా పని దినాలు పెంచడం ఎందుకు అంటూ  కెసిఆర్ పంచ్ డైలాగులు వేయడంతో భట్టి షాక్ తిన్నారు.

 

IHG


 ఇక మరో మాట మాట్లాడకుండా సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో బలహీనం అవుతూనే వస్తోంది. ఉన్న కొద్దిమంది నాయకుల్లోనూ సమన్వయం లేకపోవడం, ఎవరికి వారే తాము గొప్ప అంటే తాము గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తుండడంతో తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ వస్తోంది. ఇదే టీఆర్ఎస్ లో ధీమా పెంచుతోంది. అందుకే తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై అధికార పార్టీ ధీమాగానే ఉంది. ఎందుకంటే సభలో కాంగ్రెస్ కు ఆరుగురు సభ్యుల బలం మాత్రమే ఉంది. ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడంతో ఎన్నో ప్రశ్నలు వేయలేరు అని అధికార పార్టీ ధీమాగా ఉంది. అందుకే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో టిఆర్ఎస్ ఎక్కడా టెన్షన్ పడడం లేదు.


ఈనెల 9 10 15 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు. అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. అలాగే ఇదే నెల 11 12 తేదీల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ, 12న బడ్జెట్ పై సాధారణ చర్చకు ప్రభుత్వ సమాధానం, 13 , 14 ,16 ,17 ,18 ,19 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఈనెల 20న ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: