తొలిసారే అధికార పీఠం ఎక్కినా.. ఏపీ సీఎం జగన్ ఎలాంటి తడబాటు లేకుండా సజావుగా పాలన సాగిస్తున్నాడు. తాను ఎన్నికల ముందు చెప్పినవి ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాడు. అంతే కాదు.. అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాను చేసేది మంచి అని నమ్మితే ఎలాంటి చర్యలకైనా వెనుకాడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

 

 

ఇందుకు ఉదాహరణగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ గురించి చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల కోసం జగన్ ఓ చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం.. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అంతే కాదు.. ఆ అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది. బహుశా ఇలాంటి చట్టం దేశంలో ఇదే కావచ్చు. ఎన్నికలు అంటేనే డబ్బు పంచడం, మద్యం పంచడం, కానుకల పంచడం అన్నట్టుగా తయారైంది.

 

 

ఇలాంటి పరిస్థితుల్లో ఇవేవీ చేయకుండా కేవలం తన పాలన ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని జగన్ భావిస్తున్నారు. రాజకీయ వ్యవస్థను మెరుగుపర్చాలని, బాగు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం నిజంగా అభినందనీయమే. ఒక విధంగా ఇది దేశంలోనే ఈ నిర్ణయం విప్లవాత్మకం.. ఇలాంటి నిర్ణయాన్ని ముందు ముందు యావత్తు భారత్‌దేశంలో రాబోయే రోజుల్లో అమలు అవుతుందంటున్నారు వైసీపీ నాయకులు.

 

 

అంతే కాదు.. బలహీనవర్గాల కోసం ఏ ప్రభుత్వాలు కూడా సీఎం వైయస్‌ జగన్‌లా ఆలోచన చేయలేదని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రతీ అంశంలో 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని పట్టుబట్టి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుగురు మైనార్టీలు, ముగ్గురు ఎస్సీ, ఇద్దరు ఎస్టీలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఇచ్చవారు. కానీ.. ఇవాళ 50 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు, వాటితో పాటు దేవాదాయ కమిటీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, యూనివర్సిటీల్లోని పాలక వర్గాలు, లీగల్‌ డిపార్టుమెంట్‌లో కూడా 50 శాతం బలహీనవర్గాలకు ఇవ్వడం నిజంగా ఓ రాజకీయ విప్లవమే అంటున్నారు వైసీపీ నాయకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: