ఏపీలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీలకు ఓ పరీక్షల్లాంటివి. ఈ ఎన్నికలే వాటికి ఆయువుపట్టు.. తమ రాజకీయ భవితవ్యం మారిపోయేది ఈ ఎన్నికలతోనే.. మరి అలాంటిది ఎన్నికలు వస్తున్నాయంటే.. ప్రతిపక్షాలకు పండుగే. అధికారంలో ఉన్న పార్టీ ఎప్పటికప్పుడు తన ప్రజాదరణ నిరూపించుకోవాల్సి వస్తుంది.

 

 

ఎన్నికలంటే ఎప్పుడూ అధికార పార్టీయే హాట్ ఫేవరేట్ గా రంగంలో దిగుతుంది. అందుకే ఎన్నికలు అంటే సహజంగా అధికార పార్టీపైనే ఒత్తిడి ఉంటుంది. అధికారం నిలబెట్టుకుంటామా లేదా.. ప్రజాదరణ చూరగొంటామా లేదా.. అన్న టెన్షన్ ఉంటుంది. ఇక ప్రతిపక్షాలపై అంతగా ఒత్తిడి ఉండదు. ఎలాగూ ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి ఓడినా మరో ఓటమి అనుకుంటారు తప్ప అధికార పార్టీపై ఉన్నంత ఒత్తిడి ఉండదు.

 

 

ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ లో ఉంది. స్థానిక ఎన్నికలు జరగకుండా ఉంటే బాగుండని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భావిస్తోంది.

అందుకే ఎన్నికలు ఎలాగోలా వాయిదా వేయించేసే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ మేరకు కోర్టుల్లో కేసులు ఉన్నాయి. అంతే కాదు.. ఎన్నికల అధికారుల సమావేశంలో కూడా తెలుగు దేశం వింత వాదనలు చేసిందట.

 

 

కరోనా వైరస్ గురించి అఖిల పక్ష సమావేశంలో టీడీపీ ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. కరోనా ప్రభావం ఏపీలో ఏమాత్రం లేదని భావించిన శనివారం నాడే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు కూడా తమ అభిప్రాయాలు చెప్పాయన్నారు. కరోనా వైరస్ పై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని ప్రస్తుతం ప్రజల ఆరోగ్యానికి అది ఇబ్బందికరంగా లేదని ఆయన అన్నారు. అయినా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: