ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బాబోరు మీడియా జగన్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత తీసుకురావటానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇంగ్లీష్ మీడియం విషయంలోనూ మరియు ఇసుక విషయంలోనూ పని జరగక పోవటంతో ప్రస్తుతం అమరావతి రాజధాని విషయం అడ్డం పెట్టుకుని జగన్ పై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత తీసుకురావటానికి అన్ని రకాల దారులు వెతుకుతూ కథనాలు ప్రసారం చేస్తోంది బాబోరు మీడియా. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో మాత్రం జగన్ పాలన పట్ల పాజిటివ్ గా ప్రజలు ఉన్నారు అని జాతీయ స్థాయిలో మీడియా వార్తలు వినబడుతున్నాయి.

 

ఒక విధంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా జగన్ పరిపాలన పై తల పండిపోయిన రాజకీయ నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బాబోరు మీడియా నిర్వాకం వల్ల జగన్ క్రేజ్ కొద్దిగా బయట రాష్ట్రాలకంటే ఇక్కడ కొద్దిగా తక్కువ వినబడుతోంది. ఇటువంటి తరుణంలో బాబోరు మీడియాపై బీజేపీ నేత ఎమ్.పి జివిఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పిపిఎల రద్దు ఆలోచన, తదితర అంశాలపై ఎపి ప్రబుత్వానికి వ్యతిరేకంగా బాబోరు మీడియా చేస్తున్నదంతా అనవసర రాద్ధాంతం అని షాకింగ్ కామెంట్ చేశారు.

 

ఆయన ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ లో మాట్లాడుతూ పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదనే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారని అన్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్‌ సూచించారని తెలిపారు. ఒక చానల్‌ తనపై తప్పుడు వార్తలు నడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ కట్టుకథలు అల్లితే సమాచార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇదే సమయంలో అమరావతి విషయంలో మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఉన్న నాయకుల చేత చర్చించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను అని జివిఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: