తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి ఆదివారం అంటే.. ఈ నెల 8వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారి మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టబోతున్నారు. మండలిలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశ పెడతారు.

 

 

సీనియర్ మంత్రి హరీశ్ రావుకు ఇలా బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. ఆయన కేసీఆర్ మొదటి దఫా ప్రభుత్వంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ రెండో విడత ప్రభుత్వంలో మొదటి దఫాలో ఆయనకు మంత్రి గా అవకాశం దక్కని సంగతి తెలిసిందే. రెండో విడతలో అవకాశం దక్కించుకున్న హరీశ్ రావుకు కేసీఆర్ అనూహ్యంగా కీలకమైన ఆర్థిక శాఖ కట్టబెట్టారు.

 

 

కేటీఆర్ కు ప్రాధాన్యం పెరిగిన క్రమంలో హరీశ్ రావును పక్కన పెట్టనున్నారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆయనకు అవకాశం దక్కలేదు. కానీ.. ఆ తర్వాత పార్టీలో పరిణామాలు... నేపథ్యంలో మరోసారి హరీశ్ రావుకు ప్రాధాన్యం పెరిగినట్టయింది.

 

 

మరి హరీశ్ రావు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందో... కేటాయింపులు ఎలా ఉంటాయో.. ఏ ఏ రంగాలకు ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఏ శాఖ ఇచ్చినా దాంట్లో ప్రతిభ చూపించే సత్తా ఉన్న నాయకుడిగా హరీశ్ రావుకు మంచి పేరు ఉంది. అది ఎంత మేరకు బడ్జెట్ రూపకల్పనలో కనిపిస్తుందన్నది వేచి చూడాలి.. ఈ ఆదివారం తెలంగాణ బ‌డ్జెట్ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా వెల్లడి కానున్నది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: