బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే అయినా ఏపీలో ఆ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో వచ్చింది కేవలం ఒక్క శాతం ఓట్లే.. అంత దయనీయం అన్నమాట. కానీ కేంద్రంలో ఉన్న అధికారం పుణ్యమా అని.. దాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో అమాంతం ఎదిగిపోవాలని కలలు కంటోంది. రాజకీయాల్లో ఇలాంటి కలలు కనడం తప్పేమీ కాదు..

 

 

కానీ దానికి తగ్గట్టే వ్యూహం ఉండాలి కదా. కానీ అలాంటివేవీ ఏపీ బీజేపీలో కనిపించవు. ఈ పార్టీదతో విచిత్రమైన పరిస్థితి.. తాము రాష్ట్రంలో ఏ పార్టీకి మిత్రులుగా ఉన్నామో.. ఏ పార్టీకి శత్రువులుగా ఉన్నామో తేల్చుకోలేని పరిస్థితి.. ఓవైపు వైసీపీకి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు.. అదే పార్టీతో కత్తులు దూస్తోంది. మొన్నటి మాన్సాస్స్ ట్రస్టు చైర్ పర్సన్ గా ఆనంద గజపతి రాజు కూతురు సంచయితను ఎంపిక చేయడంపై ఆ పార్టీ నేత మాధవ్ తీవ్రంగా.. ఖండించారు.

 

 

అసలు బీజేపీకి రాష్ట్రంలో ఒక వ్యూహం అంటూ కనిపించడం లేదు. పార్టీ నేతలకే ఈ విషయంలో క్లారిటీ లేదు. సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ వంటి నేతలు టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరినా వారు ఇంకా టీడీపీ నేతల్లాగానే వ్యవహరిస్తారు.. పార్టీలో మొదటి నుంచి ఉన్న గ్రూపుది మరో దారి.. వైసీపీతో కొన్ని విషయాల్లో సానుకూలంగా నే ఉంటారు.. మరికొన్ని విషయాల్లో కత్తులు దూస్తామంటారు.

 

 

మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో దోస్తీ అంటారు.. కానీ ఆ దోస్తీ సవ్యంగా సాగే పరిస్థితో.. కార్యక్రమాలు సమన్వయం చేసుకునే పరిస్థితి కనిపించదు. అసలు ఎవరు నిర్ణయాలు తీసుకంటారు.. అన్నదే అర్థం కాని పరిస్థితి. గత ఎన్నికల్లో వచ్చింది ఒక్క శాతమే అయినా కనీసం దాన్ని పెంచుకునే స్థాయిలో నిర్ణయాలు, వ్యూహమే కరువయ్యాయి కమలదళానికి.

మరింత సమాచారం తెలుసుకోండి: