విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్ రెడ్డి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న యువ న‌టుడు. ఈ సౌత్ హీరో స్టార్‌డమ్ ఇప్పుడు బాలీవుడ్‌కు కూడా చేరింది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబై ప‌రిస‌రాల‌లో షూటింగ్ జ‌రుపుకొంటుంది. యూత్‌లో ముఖ్యంగా అమ్మాయిల్లో పెద్ద ఎత్తున విజ‌య్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. విజ‌య్ గురించి తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన ఓ అంశం వెలుగులోకి వ‌చ్చింది.  హీరో విజయ్‌ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం వారికో షాకింగ్ న్యూస్ తెలిసింది.

 


విజ‌య్‌కి ఉన్న ఫ్యాన్స్ ఆధారంగా ఓ వ్య‌క్తి కొత్త కుట్ర‌కు తెర‌దించాడు. విజయ్ దేవరకొండ నకిలీ ఫేస్‌ బుక్ ఖాతాలో సాయికుమార్ ఛాటింగ్ చేస్తూ యువతులకు గాలం వేశాడు. ఈ విష‌యం గ‌మ‌నించిన విజ‌య్ టీం సైబర్ క్రైం పోలీసులకు విజయ్ మేనేజర్ ద్వారా చేసింది. తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా, వాట్సప్‌ నంబర్లను వాడుతూ గుర్తుతెలియని వ్యక్తి చాటింగ్‌ చేస్తున్నాడని, ఇది తన ఇమేజ్‌కు భంగం కలిగించేదిగా ఉందంటూ రెండ్రోజుల క్రితం ఈ ఫిర్యాదు అందింది. దీంతో సైబర్‌క్రైం పోలీసులు పథకం ప్రకారం నిందితుడిని హైదరాబాద్‌ రప్పించి అదుపులోకి తీసుకున్నారు.

 


ఇడ్లీ బండి నడిపించే నిజామాబాద్‌ జిల్లా మిర్జాపూర్‌కు చెందిన సాయికృష్ణ ఈ నిర్వాకానికి పాల్ప‌డ్డాడ‌ని తెలింది. పదో తరగతి వరకు చదివిన సాయి ఊర్లో ఇడ్లీ బండి నిర్వహిస్తూ ఇలా మోసం చేశాడు. అయితే,  అతన్ని పట్టుకొనేందుకు నకిలీ మహిళను సృష్టించిన సైబర్‌క్రైం పోలీసులు హైద‌రాబాద్ ర‌ప్పించేలా చేశారు. పోలీసుల ట్రాప్‌లో చిక్కిన సాయికృష్ణ ఎల్బీనగర్‌కు వచ్చి క్యాబ్‌ కోసం ఎదురు చూస్తుండగా అక్కడే కాపు కాసిన సైబర్‌క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం నోటీసులు జారీచేసి ఆయన కుటుంబీకులకు అప్పగించారు. ఇడ్లీ బండి న‌డిపే ఓ కుర్రాడు హీరో ఇమేజ్‌ను ఇలా క్యాష్ చేసుకోవ‌డం షాక్ క‌లిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: