మహిళలు మల్లయుద్ధం చేయలేరు అనుకుంటున్న తరుణంలో... ఒక గొప్ప మల్ల యుద్ధవీరుడు అయినా మహావీర్ సింగ్  ఫోగట్ .. తాను సాధించలేనిది కొడుకు ద్వారా సాధించాలి అనుకున్న సమయంలో వరుసగా కూతుర్లు  పుడితే... ఎన్ని విమర్శలు ఎదురైనా కూతుర్లను గొప్ప మల్లయుద్ధ యోధులుగా మార్చారు. అయితే భారతీయులకు ఈ విషయం తెలియక పోయినా మహావీర్  సింగ్ ఫోగట్  జీవిత చరిత్రను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దంగల్ సినిమా పేరుతో  పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలు మహిళా శక్తి గురించి గొప్పగా చాటిచెప్పారు అమీర్ ఖాన్. అప్పటివరకు ఎవ్వరికి తెలియని ఈ ముగ్గురు వీరవనితల దంగల్ సినిమా తో భారతదేశానికి మొత్తం తెలిసింది. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు నాన్న మహావీర్  సింగ్  ఫోగట్  స్పూర్తితో రెస్లింగ్ లో  భారతదేశానికి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చారు. 

 

 

గీత ఫోగట్,  బబిత ఫోగట్,  వినీష్  ఫోగట్  ఎప్పుడు భారత దేశానికి గర్వకారణంగా నిలిచారు. రెస్లింగ్  కి మహిళలు పనికిరారు అని అందరూ చిన్నచూపు చూస్తున్న తరుణంలో... మహిళలు పురుషులకు ఎక్కడ తక్కువ కాదని నిరూపించి తన సత్తా చాటి మెడల్స్ సాధించారు. తండ్రి మహావీర్ సింగ్ ఫోగట్  కలను నిజం చేసి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటికీ ప్రపంచ స్థాయి రెస్లింగ్ లో  దూసుకుపోతూ... భారత్ కి గర్వకారణం గానే నిలుస్తున్నారు ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఇక ఈ ముగ్గురు అక్కచెల్లెల్ల వీరగాథలను,  తండ్రి ఇచ్చిన స్ఫూర్తిని ... 2016 లో విడుదలైన దంగల్ సినిమా లో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. 

 

 

 ఇక ఒక చిన్న పల్లెటూరు నుంచి తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో... తండ్రి చూపించిన మెలకువలతో అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఏకంగా ఒకానొక సమయంలో అబ్బాయిలను సైతం రెస్లింగ్ లో మట్టి కరిపిస్తూ ... ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగారు ఈ ముగ్గురు అక్క చెల్లెలు  ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు సాధించినా పథకాలు భారత దేశానికి గర్వకారణంగా నిలిచారు. పేదరికాన్ని జయించి మరి... ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లు భారత్ కి ఎప్పుడు గర్వకారణమే.

మరింత సమాచారం తెలుసుకోండి: