కేవలం మన దేశంలోనే ఒక స్త్రీని మూర్తీభవించిన భారత మాతగా పేర్కొంటున్నాం.. పూజిస్తున్నాం. అయితే అలాంటి మన దేశంలోనే గత కొన్ని సంవత్సరాలుగా స్త్రీ పట్ల జరుగుతున్న అన్యాయాలను, అకృత్యాలను చూస్తుంటే.. మనదేశం ఎటువైపు పయనిస్తుందో అర్ధం కావట్లేదు. పొరపాటు ఎక్కడ వుంది? స్త్రీని సింహాసనం పైన కూర్చోబెట్టడం మన పూర్వీకుల తప్పిదమా? స్త్రీని దేవేతను చేసి పూజించడం నేరమా అనే అనుమానాలు మనలో తలెత్తక మానవు.! ఏది ఏమైనా నానాటికీ ఇక్కడ స్త్రీల పరిస్థితి ఎంతో దారుణంగా ఉందనడంలో సందేహమే లేదు!

 

IHG

 

ఇక్కడ మనం వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలను సన్మానించడంతో పాటుగా వారినుద్దేశించి  అనేక కార్యక్రమాలను నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం. స్త్రీపురుష సమానత్వం, మహిళా సాధికారికత గురించి సగటు జనాలకు జాగరూకత కలిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయి. కాని ఇవి  కేవలం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొక్కుబడిగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామా అనే అనుమానం మనలో ఎంతోమందికి కలగక మానదు!

 

పూర్వ కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం, ఆరాధనభావం, ఆధునిక ప్రపంచంలో లేకుండా పోతున్నది. మహిళలను తమతో సమానంగా చూడకుండా ఉండే ప్రవృత్తి నేడు పెరిగిపోవడం చాలా ఆందోళనకరం. అందుకే స్త్రీల పట్ల మన ఆలోచనాధోరణి మారాల్సింది ఎంతైనా వుంది. నానాటికీ సమాజంలో స్త్రీల రేషియో పడిపోతున్నది.. ఇలాంటి తరుణంలో వారి సంరక్షణ కోసం మనం నడుం బిగించాల్సిన అవసరం ఎంతో వుంది. లేదంటే రాబోయే తరాలు ఒక అమ్మాయి కోసం, ముగ్గురు నలుగురు కలిసి కొట్టుకునే పరిస్థితి దాపురించక మానదు.

 

IHG

 

శిశు హత్యలు, భృణ హత్యలను నిరోధించాలి. అదేదో సినిమాలో చెప్పినట్లు... చదువుని జ్ఞానం కోసం చదవాలని భావి తరాలకు నేర్పించాలి. రైమ్స్ కాకుండా, పెద్ద బాలశిక్షలను పిల్లలకు అందివ్వాలి. ఆడపిల్ల గొప్పదనం గురించి అర్ధమయేలా వివరించాలి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, లింగపరమైన వివక్ష లేకుండా చూడడం అనేది దేశంలో ప్రతి ఒక్క పౌరుని బాధ్యతగా తీసుకోవాలి. లేదంటే రాబోయే తరాలకు స్త్రీ ఒక శాపంగా మారక తప్పదు. ఇది తధ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: