మాన్సాస్ ట్రస్ట్ బోర్డుకు, సింహాచలం దేవస్ధానం పాలక మండలి ఛైర్మన్ గా సంచయితా గజపతిరాజు నియామకంపై నిప్పు రాజుకుంటోంది. తెలుగుదేశంపార్టీ సీనియర నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు  ఛైర్మన్ గా ఉన్న పై రెండు బోర్టులను అర్ధాంతంరగా రద్దు చేసిన ప్రభుత్వం ఆయన స్ధానంలో బిజెవైఎం నేత సంచయితను నియమించటం సంచలనంగా మారింది.  ప్రభుత్వం అశోక్ ను ఎందుకు అర్ధంతరాంగా తొలగించిందో ? సంచయితను ఎందుకు నియమించిందో ? ఎవరికీ అర్ధం కావటం లేదు.

 

పై రెండు బోర్డులకు ఛైర్మన్ స్ధానంలో  కుటుంబ వారసత్వంగా అశోక్ గజపతిరాజు దశాబ్దాలుగా కంటిన్యు అవుతున్నారు. మామూలుగా  అయితే అశోక్ ను ఛైర్మన్ గా తప్పించటం సాధ్యంకాదు. అలాంటిది ప్రభుత్వం హఠాత్తుగా ఈ విషయంలో ఎందుకు వేలు పెట్టిందో అర్ధం కావటం లేదు. చేసేదేదో వైసిపి నేతను ఛైర్మన్ గా నియమించటానికి చేసిందన్నా అర్ధముండేది. కానీ అలా కాకుండా బిజెపి నేత సంచయితను ఛైర్మన్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేయటమే అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

గజపతుల కుటుంబ వ్యక్తులను కాకుండా బయట వాళ్ళను నియమించే అవకాశం లేదు కాబట్టే అశోక్ సోదరుడు ఆనంద్ కూతురు సంచయితను ఛైర్మన్ గా నియమించినట్లు అర్ధమైపోతోంది. మరి సంచయితను నియమించటం చట్ట బద్దమేనా ? అన్నదే ఇపుడు సమస్యగా మారింది. ఈ విషయాన్ని పక్కనపెడితే అశోక్ ను తప్పించటంపై టిడిపి నేతలు ప్రభుత్వంపై మండిపడటం సహజమే. కానీ ఇక్కడ విచిత్రంగా బిజెపి నేతలు కూడా అశోక్ కు మద్దతుగా మాట్లాడుతుండటమే ఆశ్యర్యంగా ఉంది. బిజెపి నేతలు మాట్లాడుతూ సంచయితను పార్టీ నుండి బహిష్కరించాలని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 110 దేవాలయాలున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు లక్ష ఎకరాలతో పాటు అనేక స్ధిరాస్తులున్నాయి. వీటి విలువ దాదాపు రూ. 10 లక్షల కోట్లని ప్రచారంలో ఉంది. కొన్ని వందల విద్యాసంస్ధలు పనిచేస్తున్నాయి. మరి ఇంతటి ప్రాధాన్యతున్న ట్రస్టు నుండి అశోక్ ను తప్పించి సంచయితను నియమించటం వెనుక  ప్రభుత్వం వ్యూహమేంటో అర్ధం కావటం లేదు. చివరికి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: