ఇప్పటి వరకు భారత దేశంలో బ్యాంకింగ్ రంగంలో ఎంత భద్రత ఉందో అంతే అభద్రత అని చాటి చెప్పారు కొంత మంది కేటుగాళ్ళు.  అయితే బడాబాబులకు ఇబ్బడి ముబ్బడిగా లోన్ల రూపంలో ఇచ్చి ఆ నష్టం ఇప్పుడు పూడ్చుకోలేం అని చేతులు ఎత్తుస్తున్న బ్యాంకులపై ఎన్ని విమర్శలు వచ్చినా వారి పందా మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ఏడాది కిందటి వరకు సూపర్‌‌గా నడిచింది యెస్‌‌ బ్యాంక్‌‌. కోట్ల మంది కస్టమర్లు. రూ. 2 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు. కానీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎన్‌‌పీఏలు పెరిగాయంటూ ఆర్‌‌బీఐ మారటోరియం విధించడం, విత్‌‌డ్రాలపై పరిమితులు పెట్టడంతో బ్యాంక్‌‌ షేర్‌‌ కుప్పకూలింది.

 

గత ఏడాది రూ.రూ. 400 పలికిన బ్యాంక్‌‌ షేర్‌‌ ఒక్కసారిగా రూ.16.60కు పడిపోయింది.  దాంతో ఇప్పుడు యెస్ బ్యాంక్ లో కేవలం రూ.50 మాత్రమే విత్‌‌డ్రా పరిమితి విధించడంతో  ఈ బ్యాంకు ముందు డిజాజిట్  డిపాజిటర్లు బ్యాంక్‌‌ ఏటీఎంలు, బ్రాంచ్‌‌ల ముందు క్యూ కట్టారు. మరో వైపు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌, ఆర్బీఐ హామీ ఇచ్చినా పరిస్థితేం మారలేదు.  కానీ ఎవరి భయం వారిదే అన్నట్టు బ్యాంక్ రన్నింగ్ లో ఉన్నపుడే డబ్బు తీసుకొని క్లోజ్ చేయాలని భావిస్తున్నారు కస్టమర్లు. రూ.2 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న యెస్‌‌ బ్యాంకు.. కస్టమర్లకు రూ. 2 లక్షల కోట్లకుపైనే అప్పులిచ్చింది.

 

కానీ వాళ్లు డబ్బులు సరిగా కట్టకపోవడంతో ఎన్‌‌పీఏలు పెరిగాయి. ఇదిలా ఉంటే డబ్బంతా సేఫ్‌‌‌‌గా ఉంటుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ డిపాజిటర్లకు ఉపశమనం కల్పించారు. ‘ఆర్‌‌‌‌‌‌‌‌బీఐతో నేను కంటిన్యూగా మాట్లాడుతున్నా. వెనువెంటనే సమస్యను పరిష్కరిస్తామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ హామీ ఇచ్చింది. మేము పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నాం’ అని నిర్మలా తెలిపారు. కానీ గతంలో పలు బ్యాంకులు చేసిన మోసాల విషయంలో దెబ్బతిన్న కస్టమర్లు ఈసారి  మళ్లీ నష్టపోతామా అన్న ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: