తెలుగు రాజకీయ చరిత్రలో ఒక మహిళను హోం మంత్రిని చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి... ఆ తర్వాత ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. తెలుగు రాజకీయాలు చరిత్రలో హోం మంత్రిగా ఒక మహిళను చేసిన ఘనత ఈ తండ్రీ కొడుకులకే దక్కుతుంది. ముందుగా రాష్ట్రం క‌ల‌సి ఉన్న‌ప్పుడు ప్ర‌స్తుత తెలంగాణ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిని వైఎస్ హోం మంత్రిగా చేశారు. తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఓ మ‌హిళా హోం మంత్రిని చేసిన ఘ‌న‌త వైఎస్‌కే ద‌క్కింది.



ఆ త‌ర్వాత రాష్ట్రం విడిపోయిక తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి విడ‌త‌లో ఒక్క మ‌హిళ‌కు కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వలేదు. ఆ త‌ర్వాత ఆయ‌న రెండోసారి సీఎం అయ్యాక కూడా కూడా కాస్త గ్యాప్ తీసుకుని స‌బితా ఇంద్రారెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్‌కు మాత్ర‌మే మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇక ఏపీలో చంద్ర‌బాబు సీఎం అయ్యాక ముందుగా ప‌రిటాల సునీత‌, కిమిడి మృణాళిని, పీత‌ల సుజాత‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఆ త‌ర్వాత కేబినెట్ మార్పుల్లో భూమా అఖిల‌ప్రియ‌కు సైతం మంత్రి ప‌ద‌వి ద‌క్కింది.



ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన వెంట‌నే త‌న కేబినెట్లో ఏకంగా ముగ్గురు మంత్రుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వీరిలో ఎస్సీ కోటాలో తానేటి వ‌నిత‌, మేక‌తోటి సుచ‌రిత ఉండ‌గా.. ఆ త‌ర్వాత ఎస్టీ కోటాలో పాముల శ్రీపుష్ప వాణి ఉన్నారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఎస్టీ కోటాలో శ్రీవాణిని ఏకంగా డిప్యూటీ సీఎం చేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కింది. అదే టైంలో ఎస్సీ మ‌హిళ‌కు హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ తెలుగు రాజ‌కీయాల చ‌రిత్ర‌లోనే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేశారు. ఏదేమైనా మ‌హిళా మంత్రుల విష‌యంలో నాడు తండ్రి క్రియేట్ చేసిన రికార్డును ఇప్పుడు త‌న‌యుడు జ‌గ‌న్ త‌న‌కు తానే బ‌ద్ద‌లు కొట్టి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశాడ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: