ఎవరుబడితే వారు.. ఎక్కడపడితే అక్కడ.. ఇష్టమొచ్చినట్లుగా ఆడేసుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన తప్పులతో పాటు, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా చేస్తున్న విమర్శలపైనా వైసీపీ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. ఇక బాబు ని తీవ్ర స్థాయిలో విమర్శించేందుకు ఎప్పుడూ వైసీపీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ముందుంటారు. ఆ విధంగానే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు పై అదేవిధంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. కేవలం 29 గ్రామాలకు పరిమితమైపోయిన నువ్వా..?  మమ్మల్ని రౌడీలు అనేది అంటూ ఆయన మండిపడ్డారు.

 

IHG


 చంద్రబాబు నీకు దమ్ముంటే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో మీ సత్తా చూపించు. నీలాగా గుంట నక్క జిత్తులు మాకు తెలియదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వచ్చు అంటూ ఆయన మండిపడ్డారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా అంటూ అనిల్ ఎద్దేవా చేశారు. బీసీల గురించి పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు బీసీలకు అన్యాయం చేసింది తానేనని మర్చి పోతున్నాడు అని, కోర్టులకు తన అనుచరులను పంపించి కేసుల వాయిదా వేయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని అనిల్ ప్రశ్నించారు.


 ఓటమి భయం చంద్రబాబు లో ఎక్కువ అవ్వడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారని, కొన్ని అనుకూల మీడియా డబ్బాలను పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేయడం మంచిది కాదంటూ అనిల్ హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు మార్కెట్ యార్డు పదవులతో పాటు 50% పదవులు ఇచ్చిన ఘనత జగన్ కు దక్కుతుందని అనిల్ చెప్పారు. చంద్రబాబు పార్టీ ఏపీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదని అనిల్ కుమార్ జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: