ప్రస్తుతం భారతదేశంలో కరోనా  అందరినీ బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత దేశ వ్యాప్తంగా 31 కరోనా  పాజిటివ్ కేసులు నమోదు కావడంతో... అందరూ ప్రాణభయంతో నే బతుకుతున్నారు. అయితే అటు తెలంగాణలో కూడా కరోనా  పాజిటివ్  కేసు నమోదు కావడంతో అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక కరోనా  శరవేగంగా వ్యాప్తిచెండుతుండటంతో  ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్కులకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి పోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు మాస్కు ధరించాలి అని వైద్యులు సూచించడమే ఆలస్యం... అందరూ మాస్క్ లను ధరిస్తూ పబ్లిక్ లోకి వెళ్తున్నారు. ఇక నగర వాసులు అందరూ అయితే మాస్కులు లేకుండా అసలు కాలు  కూడా బయట పెట్టడం లేదు. ఇక ఇదే అదనుగా భావించిన మెడికల్ షాప్ నిర్వాహకులు కూడా మాస్కులను ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. 

 


 ఇక అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా ప్రజలందరూ పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. అంతే కాకుండా కరోనా  వైరస్ సోకిన వారికి చికిత్స అందించేందుకు వైద్యులకు కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ మాత్రం కనీసం ముఖానికి మాస్కు భరించడానికి ససేమిరా అంటున్నారు. కేవలం హాస్పిటల్ లోనే రోగుల వద్దకు పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో మాత్రం అస్సలు ధరించడం లేదు. 

 

 

 రాష్ట్ర ప్రజలందరికీ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్నా ఆరోగ్య శాఖ మంత్రి... మాస్కులు ధరించకపోవటం  ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ విషయాన్ని అటు మీడియా ప్రతినిధులు ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను అడిగారు కూడా. అయితే దీనిపై ఈటల రాజేందర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. ప్రాణాంతకమైన కరోనా  వైరస్ రాకుండా వ్యక్తిగత శుభ్రత ఎంతో అవసరమని తెలిపిన ఈటల రాజేందర్.. ఈ వైరస్ సోకిన వారు తప్ప ఇతరులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు. ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేలా చేయడం కోసమే తాను మాస్కూలు   ధరించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజలకు సందేశం ఇవ్వడం కోసం  మాస్క్ లను ధరించటం  లేదని అసలు కరోనా  సోకని వారికి మాస్క్ లు  అవసరమే లేదు అంటూ తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి: