దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హవాలా డబ్బు తరలింపు కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరియు మీడియా రంగంలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వం పై చాలా అవినీతి ఆరోపణలు రావడం జరిగాయి. అంతేకాకుండా ఆ అవినీతి సొమ్ముతో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఇతర   పార్టీలకు భారీగా చంద్రబాబు డబ్బులు సర్దుబాటు చేయటం జరిగిందని తాజాగా కొన్ని విషయాలు బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఇన్కమ్ టాక్స్ అధికారులు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ చౌదరి వద్ద దాడులు చేసిన సందర్భంలో ఈ విషయం బయట పడినట్లు ఏపీ మీడియాలో వార్తలు రావడం జరిగాయి.

 

అంతేకాకుండా శ్రీనివాస్ చౌదరి వద్ద 2014 నుండి 2019 చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించి కాంట్రాక్టుల విషయాలకు సంబంధించి అనేక డబ్బు లావాదేవీల గురించి అన్ని వివరాలు కలిగిన డైరీలు కూడా లభ్యమైనట్లు ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రావడం జరిగాయి. డైరీ లో ఉన్న ఆధారాల ప్రకారం ఇటీవల ఇన్కమ్ టాక్స్ అధికారులు సోనియాగాంధీ అంతరంగికుడు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి రాజ్యసభ అహ్మద్ పటేల్ కు ఐటీ ఇటీవల నోటీసులు అందించడంతో తెలుగుదేశం పార్టీలో కలకలం స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇదే సందర్భంలో చంద్రబాబు మెడకు కూడా అహ్మద్ పటేల్ వ్యవహారం చుట్టుకోనున్నట్లు బలమైన వార్తలు జాతీయ స్థాయిలో మరియు ఏపీలో వినబడుతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు కార్యాలయానికి అప్పట్లో ఆహ్మద్ పటేల్ కి విరాళంగా సేకరించిన రూ.550 కోట్లకు లెక్కలు చెప్పాల్సిందేనని ఐటీ శాఖ వివరణ కోరుతూ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు హవాలా రూపంలో అహ్మద్ పటేల్ కి డబ్బులు పంపించడంతో  కేసు రుజువైతే అహ్మద్ పటేల్ తో చంద్రబాబు కూడా జైలు కూడు తినే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: